మీడియా మొఘల్ రామోజీ రావు జీవిత విశేషాలు

Legendary Media Entrepreneur and Famous Business Personality Ramoji Rao's Life History

మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామోజీ ఈ వేకువ జామున మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించి సందర్శకుల దర్శనార్ధం ఏర్పాట్లు చేశారు. కాగా రామోజీరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభలో ఎన్డీయే పక్ష నాయకుడు నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రామోజీరావు జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

రామోజీ రావు గారి ప్రస్థానం..

స్వస్థలం: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెదపారుపూడి
జననం: 1936 నవంబర్‌ 16
తల్లిదండ్రులు: చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ
తోబుట్టువులు: రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ
విద్యాభాస్యం: గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ వరకు
కెరీర్: ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా 3 ఏళ్ళు ఉద్యోగం
1961 ఆగస్టు 19 – రమాదేవితో వివాహం
సంతానం: కిరణ్, సుమన్
1962 – మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ స్థాపన
1969 – అన్నదాత పత్రిక ప్రారంభం
1970 – ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభం
1971 – విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ స్థాపన
1974 ఆగస్టు 10 – విశాఖపట్నం వేదికగా ‘ఈనాడు’ దినపత్రిక ప్రారంభం
1983 – ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ ఏర్పాటు.
1990 – ఈనాడు జర్నలిజం స్కూలు ప్రారంభం
సితార, చతుర, విపుల మాస పత్రికలు మరియు అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం ఏర్పాటు
ఈటీవీ నెట్‌వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, కొలోరమ ప్రింటర్స్ ఏర్పాటు

రామోజీ ఫిల్మ్‌ సిటీ ప్రత్యేకతలు

1996 – హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఏర్పాటు
మొత్తం విస్తీర్ణం: 1,666 ఎకరాలు (674 హెక్టార్లు)
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ధృవీకరించబడింది

రామోజీరావు అందుకున్న అవార్డులు..

సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డులు – 4 (తెలుగు సినిమాలలో రచనలకు)
నంది అవార్డులు – 5
నేషనల్ ఫిల్మ్ అవార్డు – 1
2016 – పద్మభూషణ్, పద్మవిభూషణ్ (జర్నలిజం, సాహిత్యం, విద్య విభాగాలలో)

రామోజీరావు అందుకున్న డాక్టరేట్స్

ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
యుధవీర్ అవార్దు
కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదురి (రాజస్తాన్) అవార్డు
బి. డి. గోయెంకా అవార్డు

రామోజీరావు నిర్మించిన సినిమాలు

1984 – శ్రీవారికి ప్రేమలేఖ
1985 – మయూరి
1987 – ప్రతిఘటన
1989 – మౌన పోరాటం
1991 – పీపుల్స్ ఎన్‌కౌంటర్
1991 – అశ్వని
1999 – మెకానిక్ మామయ్య
2000 – చిత్రం
2001 – ఇష్టం
2000 – నువ్వే కావాలి
2000 – మూడు ముక్కలాట
2001 – ఆనందం
2001 – ఆకాశ వీధిలో
2001 – నిన్ను చూడాలని
2003 – తుఝె మేరీ కసమ్ (హిందీ)
2005 – వీధి
2008 – నచ్చావులే
2009 – నిన్ను కలిసాక
2009 – సవారి (కన్నద గమ్యమ్)

తెలుగు, కన్నడ, హిందీ మరియు ఇతర భాషలలో 80కిపైగా చిత్రాల నిర్మాణం

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.