రామోజీ రావు కన్నుమూత.. సంతాపం తెలిపిన అల్లు అర్జున్

Icon Star Allu Arjun Mourns on Ramoji Raos Demise

తెలుగునాట దిగ్గజ మీడియా అధిపతి, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామోజీ ఈ వేకువ జామున మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కూడా రామోజీరావు మృతిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదిక‌గా ఆయన ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేశారు. అందులో.. “నేను అమితంగా గౌరవించే మార్గదర్శకుడు మరియు స్ఫూర్తిదాయకమైన దార్శనికుడు అయిన రామోజీ రావు గారు మరణించినందుకు గాఢంగా విచారిస్తున్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసిన ప్రతిసారీ గొప్ప అనుభూతి చెందుతాను. మీడియా, సినిమా మరియు అనేక ఇతర పరిశ్రమలకు ఆయన చేసిన అసమానమైన సేవలు ఎన్నటికీ మరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు మరియు ప్రియమైన వారికి హృదయపూర్వక సానుభూతి. ఆయన గొప్ప ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు అల్లు అర్జున్.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.