తమిళ హీరో తల అజిత్-మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈరోజుతో పూర్తయింది.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ షెడ్యూల్ లో ఫైట్ సీక్వెన్స్ తోపాటు ఇంట్రో సాంగ్ ను షూట్ చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. రీసెంట్ గా విడుదలైన అజిత్ ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అజిత్ ఈసినిమాతో పాటు విడా ముయార్చి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. మగిజ్ తిరుమనేని తెరకెక్కిస్తుండగా అర్జున్ సర్జా ,త్రిష,ఆండ్రియా జెర్మియా,అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను ఈఏడాది చివర్లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక అజిత్ చివరి రెండు సినిమాలు వలిమై ,తునీవు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయాయి. దాంతో విడా ముయార్చితో బ్లాక్ బాస్టర్ కొట్టి ఫామ్ లోకి రావాలని అజిత్ పట్టుదలతో వున్నాడు.ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈనెల చివర్లో స్టార్ట్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: