కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 85

vijay devarakonda 13th movie shooting update
షూటింగ్ అప్‌డేట్

VD13 లోకేషన్ వేట అయింది.. షూట్ కు రెడీ

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టి రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా హిట్లను అందుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలో విజయ్ కు సరైన హిట్ పడలేదు. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం 13 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. యూఎస్ఏ లో లోకేషన్స్ వేట పూర్తయింది.. షూటింగ్ ను…

TFN Adminవాట్సాప్
vishwak sen 11th movie second schedule wrapped up
షూటింగ్ అప్‌డేట్

VS11 రా అండ్ రగ్డ్ సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే వరుసగా అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ధమ్కీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఇది తన కెరీర్ లో వస్తున్న 11వ సినిమా కావడంతో VS11 అనే వర్కింగ్ టైటిల్ తోనే ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా…

TFN Adminవాట్సాప్
salaar prabhas movie trailer will release in august month
ట్రైలర్ & టీజర్

కన్ఫామ్ ఆగష్ట్ లో సలార్ ట్రైలర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.ఈసినిమా కె.జి.యఫ్ ను మించి ఉంటుందని.. యాక్షన్ సీక్వెన్స్ కానీ.. గ్రాఫిక్ వర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా కె.జి.యఫ్ కు రెండింతలు సలార్ లో ఉంటుందని మేకర్స్ ఎప్పుడో చెప్పారు. అది నిజమే అని రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక టీజర్ సోషల్ మీడియాలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. 24 గంటల్లో ఈసినిమా 83 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని 1.5 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకొని మోస్ట్ వ్యూయ్డ్ టీజర్ గా కొత్త రికార్డు…

TFN Adminవాట్సాప్
udhayanidhi stalin nayakudu movie telugu trailer out
ట్రైలర్ & టీజర్

నాయకుడు ట్రైలర్ రిలీజ్

సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన సినిమా మామన్నన్. తమిళ్ లో పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులోకి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే ఆసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకోగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
bedurulanka 2012 movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

బెదురులంక 2012 రిలీజ్ డేట్ ఫిక్స్

క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక2012. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఎదురుచూస్తున్న కార్తికేయ ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దానికి తగినట్టే ఈసినిమా కూడా డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. అప్పట్లో వరుస అప్ డేట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌, గ్లింప్స్ వీడియో, టీజర్‌ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చి సినిమాపై అంచనాలను పెంచేేశాయి. అయితే ఈమధ్య చిత్రయూనిట్ సైలెంట్ అయిపోయింది. ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ తో వచ్చారు.

TFN Adminవాట్సాప్
megastar chiranjeevi gave update on his next movie
సినిమా వార్తలు

కొత్త సినిమాపై చిరు అప్ డేట్

మెగాస్టార్ చిరు స్పీడు మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడంలేదు. ఒకపక్క సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. షూటింగ్ లు కంప్లీట్ చేసేస్తున్నాడు. మరోపక్క కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా రానుంది. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అయినా కూడా ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టు సినిమాను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
prabhas project k movie title and trailer release date update
ట్రైలర్ & టీజర్

ప్రాజెక్ట్ K టైటిల్, ట్రైలర్ అప్ డేట్ అప్పుడే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. సినిమాల రిజల్ట్ ల సంగతి పక్కనపెడితే ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గట్లేదు. రీసెంట్ గానే ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయగా అది మిక్స్డ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై పడింది. వీటిలో సలార్ సినిమా ఈఏడాదే రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటో తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Telugu Movies Releasing In Theaters Today
సినిమా వార్తలు

థియేటర్లలో ఈరోజు రిలీజ్ అయిన సినిమాలు

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లు కొత్త సినిమాలతో సందడిగా మారతాయి. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవారం, జులై 7, 2023) పలు కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి స్టార్ హీరోల సినిమాలు కాకపోయినా.. కొందరు ప్రముఖ నటులు నటించినవి కావడం, అలాగే మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో ఆయా చిత్రాల నిర్మాతలు, దర్శకులు చెప్పడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఇవే..!

Srikanth Mవాట్సాప్
vaishnav tej aadikeshava movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఆదికేశవ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే సెన్సేషనల్ హిట్ కొట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆతరువాత పలు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుద్ర కాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. మొదటిసారి ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు వైష్ణవ్ తేజ్. ఇటీవలే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై…

TFN Adminవాట్సాప్
bedurulanka 2012 release date announcement
రిలీజ్ అప్‌డేట్

బెదురులంక 2012 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ అప్ డేట్

టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ…

TFN Adminవాట్సాప్
chiranjeevi completes his dubbing for bholaa shankar movie
సినిమా వార్తలు

భోళాశంకర్ డబ్బింగ్ పూర్తిచేసుకున్న చిరు

అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన జోష్ ఏమాత్రం తగ్గించడం లేదు. యంగ్ హీరోలే ఏడాదికి ఒకటి రిలీజ్ చేస్తుంటే చిరు మాత్రం రెండేసి సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ అంటూ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ ఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వెళ్లింది.

TFN Adminవాట్సాప్
sree vishnu samajavaragamana first week word wide collections
బాక్సాఫీస్

సామజవరగమన ఫస్ట్ వీక్ బ్లాస్టింగ్ కలెక్షన్స్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు, ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇక చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకు సామజవరగమన సినిమాతో అది నెరవేరింది. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా ప్రేక్షకుల ఆదరణను పొందింది. తాజాగా బన్నీ కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని…

TFN Adminవాట్సాప్
dhanush 50th movie shooting begin
షూటింగ్ అప్‌డేట్

ధనుష్50 షూటింగ్ మొదలు

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే సార్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ మూవీ గా ఈ సినిమా వస్తుంది. ఇక దీనితో పాటు విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతుంది. ఇంకా హిందీలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
latest tamil hit maamannan movie to release in telugu as nayakudu
సినిమా వార్తలు

తెలుగులోకి తమిళ్ హిట్ మూవీ

ఇప్పుడు ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. మాతృకలో సూపర్ హిట్ అయితే ఇక్కడ ప్రొడ్యూసర్స్ సినిమా హక్కులను సొంతం చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో అలా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మామన్నన్. సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా ఈసినిమా వచ్చింది. పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. అంతేకాదు మొదటిరోజే ఈసినిమా 5కోట్ల కలెక్షన్స్ రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
action packed schedule for mahesh babu guntur kaaram movie
షూటింగ్ అప్‌డేట్

గుంటూరు కారం యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికే చాలా టైమ్ తీసుకుంది. నిజానికి సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈసినిమాను కూడా మహేష్ స్టార్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ మధ్యలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడం.. ఆ తరువాత పలు పరిస్థితుల వల్ల చాలా రోజులకి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇక ఎలాగూ షూటింగ్ మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక కొత్త షెడ్యూల్ ను ప్రారంభించాలని అనుకునేలోపు పలు…

TFN Adminవాట్సాప్
balakrishna bhagavanth kesari movie nearing completion
సినిమా వార్తలు

క్లైమాక్స్ లో బాలయ్య భగవంత్ కేసరి

నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
kalyan ram new movie update
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ అప్డేట్

యంగ్ డైరెక్టర్స్ ను ప్రోత్సహించడం లో ముందు వరుసలో వుండే హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇప్పటివరకు తన సినిమాలకు దాదాపు కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూనే వస్తుండగా తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు.ఈరోజు కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా తన 21వ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు.ఈసినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయనున్నాడు.అశోక ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి.అశోక ఆర్ట్స్ సంస్థ కు ఇది రెండో సినిమా.

Mahender Reddyవాట్సాప్
nikhil siddhartha apologies to his fans
సినిమా వార్తలు

స్పై మూవీ రిలీజ్ పై నిఖిల్ సారీ

గత ఏడాది కార్తికేయ2, 18పేజీస్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. వీటిలో కార్తికేయ2 సినిమా అయితే దేశవ్యాప్తంగా మంచి హిట్ ను సొంతం చేసుకొని నిఖిల్ కు పాన్ ఇండియా వైడ్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ ఏడాది అదే జోష్ తో హ్యాట్రిక్ కొడదామని స్పై అనే సినిమాతో రంగంలోకి దిగాడు. ఈసినిమాా జూన్ 9 తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అంచనాలను అందుకోలేదన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈసినిమా మంచి కలెక్షన్స్ నే అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో ఈసినిమా 28 కోట్లను సొంతం చేసుకొని…

TFN Adminవాట్సాప్
pawan kalyan and sai dharam tej starrer bro movie shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

బ్రో షూటింగ్ కంప్లీట్- థ్యాంక్స్ చిన్న పదం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా బ్రో. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూాడా నటిస్తుండటంతో ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుండి మొదలుపెట్టారు. అప్పటినుండీ వరుస షెడ్యూల్స్ తో శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ముఖ్యంగా టీజర్ సినిమాపై అంచనాలను మరింత…

TFN Adminవాట్సాప్
kamal haasan 233 movie begin
సినిమా వార్తలు

కమల్ 233 మూవీ మొదలు

విలక్షణ నటుడు కమల్ కూడా ఒక సినిమా తరువాత ఒక చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఇదిలా ఉండగా మణిరత్నంతో కూడా కమల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది. మరోవైపు తెలుగులో ప్రభాస్‌ `ప్రాజెక్ట్‌ కే`లో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్