తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే సార్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ గా ఈ సినిమా వస్తుంది. ఇక దీనితో పాటు విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతుంది. ఇంకా హిందీలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇది ధనుష్ 50 వ సినిమా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ స్వయంగా తెలియచేసింది. షూటింగ్ బిగిన్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేస్తూ మరీ తెలియచేశారు మేకర్స్. కాగా ఈసినిమా తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ కథ నార్త్ చెన్నైకి సంబంధించిన ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: