ఇప్పుడు ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. మాతృకలో సూపర్ హిట్ అయితే ఇక్కడ ప్రొడ్యూసర్స్ సినిమా హక్కులను సొంతం చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో అలా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మామన్నన్. సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా ఈసినిమా వచ్చింది. పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. అంతేకాదు మొదటిరోజే ఈసినిమా 5కోట్ల కలెక్షన్స్ రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే ఆసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా తెలుగు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జులై 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి తమిళ్ లో హిట్ అయిన ఈసినిమా తెలుగులో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక ఈసినిమాలో వడివేలు, కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: