బెదురులంక 2012 రిలీజ్ డేట్ ఫిక్స్

bedurulanka 2012 movie release date fixed

క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక2012. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఎదురుచూస్తున్న కార్తికేయ ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దానికి తగినట్టే ఈసినిమా కూడా డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. అప్పట్లో వరుస అప్ డేట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌, గ్లింప్స్ వీడియో, టీజర్‌ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చి సినిమాపై అంచనాలను పెంచేేశాయి. అయితే ఈమధ్య చిత్రయూనిట్ సైలెంట్ అయిపోయింది. ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ తో వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు 5 గంటలకు అనౌన్స్ చేస్తామని మేకర్స్ నిన్న అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఆగష్ట్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్‌, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.