‘పందెం కోడి 2’, ‘సర్కార్’, ‘మారి 2’ వంటి తమిళ అనువాద చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్. ఆ యా చిత్రాల్లో విలనిజాన్ని పండించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఈ సారి తెలుగులో ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. మే 17న లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా… జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్నాడు. చిరంతన్ భట్ సంగీతం అందించనున్నాడు. ఇదిలా ఉంటే… పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా… ఈ సినిమాలో మరో విలన్ పాత్ర కూడా ఉందట. అయితే… లేడీ విలన్ రోల్. ఈ పాత్ర కోసమే వరలక్ష్మి శరత్ కుమార్‌ను ఎంపిక చేసినట్టు టాక్. మరి తన విలనిజంతో తమిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ నటీమణి… తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఏదేమైనా… వరలక్ష్మి ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా… ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: