మూడు దశాబ్దాల తరువాత వెండి తెరకు

Legendary Actress Jamuna To Make Re-Entry In Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Heroine Jamuna Latest News,Jamuna Upcoming Movie News,Jamuna Next Film Updates,Jamuna New Movie News,Legendary Actress Jamuna Upcoming Film News
Legendary Actress Jamuna To Make Re-Entry In Movies

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లను తెరకెక్కించారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు… ఇలా అన్ని రంగాలకు చెందిన వారి బయోపిక్ లు తెరకెక్కిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్, మోడీ, మన్మోహన్ సింగ్ ఇలా పలు రాజకీయ నేతల బయోపిక్ లు తెరకెక్కించగా.. ఇప్పుడు మరో రాజకీయ నాయకుడి బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. ఆ రాజకీయ నేత ఎవరో కాదు దేవినేని నెహ్రూ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వంలో నందమూరి తారకరత్న ప్రధాన పాత్రల్లో “దేవినేని” టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్ తో దేవినేని నెహ్రూ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు రోజుల క్రితమే లాంచనంగా ప్రారంభించారు.

ఇదిలా ఉండగా ఈ బయోపిక్ లో అలనాటి అందాల నటి..
లెజెండరీ యాక్ట్రెస్ జమున నటించనున్నట్టు తెలుస్తోంది. ఓ కీలకమైన పాత్రలో జమున నటించనున్నారట. మరి 1954 లో మా గోపి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన జమున ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ తో.. డైరెక్టర్స్ తో పనిచేశారు. 1960 మరియు 1970 గోల్డెన్ ఎరాలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన జమునకు 1990 లో హిందీ సినిమా లేడీ టార్జన్ సినిమా ఆఖరి సినిమా. ఆ తరువాత ఆమె సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ ఈ బయోపిక్ తో వెండి తెరపై ప్రత్యక్షమవ్వనున్నారు. మరి ఇన్నేళ్లను ఈ లెజెండరీ యాక్ట్రెస్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం హర్షించతగ్గ విషయమే..

[subscribe]


[youtube_video videoid=hxQbCD_2oaw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − thirteen =