
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 86


తనకు ఇష్టమైన రోజే నిష్క్రమించిన విజయనిర్మల
డిటెక్టివ్ పాత్రలలో టాలీవుడ్ హీరోలు

విజయనిర్మల మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

కె. బాలచందర్ ‘ఇది కథ కాదు’కు 40 ఏళ్ళు

ప్రేక్షకుల దగ్గరకు 'రాజ్‌దూత్' యూనిట్ టూర్
అలియా భట్ సొంత యూ ట్యూబ్ ఛానల్ లాంచ్
అర్జున్ రెడ్డి మానియా.. ఇప్పుడు కన్నడ కూడా

PSV గరుడ వేగ సీక్వెల్ లో రాజశేఖర్

సౌత్ రీమేక్ మూవీస్ లో బాలీవుడ్ హీరోలు

గ‌్రామీణ నేపథ్యంలో ‘ప్రతి రోజూ పండగే’?

సూర్య మూవీ కోసం రాజమౌళి

'లా' కి 'ఇజ్జత్' ఇచ్చే కట్టినమ్-లైట్ తీస్కో
పవన్ ఓటమిపై పరుచూరి పలుకులు..!

సెన్సార్ పూర్తిచేసుకున్న కల్కీ

బ్రోచేవారెవరురా మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

బహుముఖ ప్రజ్ఞాశాలికి సినీ - రాజకీయ ప్రముఖులు ఘన నివాళులు
గత కొంతకాలంగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పొయిందని ఇప్పటికే పలువురు సినీ-రాజకీయ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. ఆమె పార్థీవ దేహాన్ని దర్శించడానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా కదలివచ్చారు.

తనకు ఇష్టమైన రోజే నిష్క్రమించిన విజయనిర్మల
నటి, డైరెక్టర్, నిర్మాత ఇలా తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించిన అలనాటి అందాల తార విజయనిర్మల గత రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక తీరని లోటును మిగిల్చారు. విజయ నిర్మల మృతిపై అటు సినీ ప్రముఖులతో పాటు ఇటు పలు రాజకీయ నేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. తన సినీ జీవితంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు విజయనిర్మల. రంగుల రాట్నం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల ఆ తరువాత వెనక్కిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక సాక్షి సినిమాలో జంటగా నటించిన కృష్ణ. విజయనిర్మల ఆ పరిచయంతో రియల్ లైఫ్ లో కూడా జీవితభాగస్వామ్యులుగా మారి ఆ తరువాత ఏకంగా 40కు పైగా సినిమాల్లో కలిసి…
డిటెక్టివ్ పాత్రలలో టాలీవుడ్ హీరోలు
హాలీవుడ్ లో రూపొందే జేమ్స్ బాండ్ మూవీస్ కు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ ఉంది. బెంగాలీ సాహిత్యం లో డిటెక్టివ్ సాహిత్యం ఒక వెలుగు వెలిగింది. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, మధు బాబు ల తెలుగు డిటెక్టివ్ సాహిత్యం కుర్రకారును ఒక ఊపు ఊపింది. డిటెక్టివ్ నవలలోని డిటెక్టివ్ వాలి, యుగంధర్, షాడో , బుల్లెట్ పాత్రలు ప్రేక్షకాదరణ పొందాయి. బెంగాలీ డిటెక్టివ్ సాహిత్యానికి ప్రభావితుడైన నిర్మాత చక్రపాణి మిస్సమ్మ మూవీ లో ANR ను లోకల్ డిటెక్టివ్ పాత్రలో నటింపజేశారు.
ఆమె అస్తమయంతో కృష్ణ పక్ష తిమిరంలోకి కృష్ణ జీవితం
స్వభావరీత్యా పురుషాధిక్య లక్షణం కలిగిన చిత్ర పరిశ్రమలో మహిళా విజయానికి, మహిళా వికాసానికి, మహిళా గళానికి రిప్రజెంటింగ్ పర్సనాలిటీగా ఎదిగిన అసామాన్య వ్యక్తిత్వ మూర్తి శ్రీమతి విజయనిర్మల. ప్రతిభ, పట్టుదల, కార్యదక్షత, నాయకత్వ లక్షణాలలో తన భర్త సూపర్ స్టార్ కృష్ణకు ఏ మాత్రం తీసిపోని సమర్థత విజయనిర్మల సొంతం. తెలుగు, తమిళ, మళయాల రంగాలలో కొద్ది రోజుల తేడాతో హీరోయిన్ గా పరిచయమై మూడు రంగాలలో తొలి చిత్రంతోనే విజయాలు సాధించి హ్యాట్రిక్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ విజయనిర్మల. అలాగే దర్శకురాలిగా ముందు మలయాళంలో తొలి ప్రయత్నం చేసి విజయాన్ని అందుకుని తెలుగులో మీనా చిత్రం ద్వారా…
ఈ ఏడాదిలోనూ టాలీవుడ్ జూలై సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా?
గత ఐదేళ్లుగా టాలీవుడ్‌కు జూలై నెల బాగా కలిసొస్తోంది. ముఖ్యంగా... 2014 నుంచి ఈ నెలలో విడుదలైన తెలుగు సినిమాలు అనూహ్య విజయాలను సాధిస్తూ... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ళలో టాలీవుడ్ జూలై ట్రాక్ రికార్డ్‌ను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 2014లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’తో మొదలైన ఈ `జూలై` విజయపరంపర... 2015లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బెగినింగ్’తో మరో స్థాయికి వెళ్ళింది. అనంతరం 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’, 2017లో విడుదలైన ‘ఫిదా’, 2018లో వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ ఘనవిజయాలు సాధించడంతో టాలీవుడ్‌లో జూలై…

విజయనిర్మల మృతిపై సినీ ప్రముఖుల సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, అలనాటి అందాల నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశారు. ఇక విజయనిర్మల మృతికి సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె మృతిపట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

కె. బాలచందర్ ‘ఇది కథ కాదు’కు 40 ఏళ్ళు
మధ్యతరగతి కుటుంబాల వారి మనస్తత్వాలను ఆవిష్కరించడంలో దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ శైలే వేరు. మనింటి కథనో లేదంటే పక్కింటి కథనో వెండితెరపై వీక్షిస్తున్న అనుభూతిని కలిగించే కథనాలు, పాత్రల స్వభావాలు ఆయన సినిమాల్లో కనిపిస్తుంటాయి. అలా ఈ దర్శకదిగ్గజం రూపొందించిన అపూర్వ చిత్రాల్లో ‘ఇది కథ కాదు’ ఒకటి. జయసుధ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చిరంజీవి, కమల్ హాసన్, శరత్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు. మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్ళలో వచ్చిన ఈ చిత్రం... నటుడిగా చిరు స్థాయిని పెంచింది. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రలో చిరు అభినయం రమణీయం, చిరస్మరణీయం.

ప్రముఖ సంస్థకు సాహో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ మూవీ సాహో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చి సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సైతం క్రియేట్ చేసింది. ప్రభాస్ పై, సుజిత్ పై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈసినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రేక్షకుల దగ్గరకు 'రాజ్‌దూత్' యూనిట్ టూర్
స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'రాజ్ దూత్'. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజై మిలియన్ వ్యూస్ అధిగమించి యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అటు పరిశ్రమ వర్గాలు నుంచి ఇటు సామాన్య ప్రేక్షకుడిలోనూ మంచి స్పందన వచ్చింది. రియల్ స్టార్ వారసుడిగా మేఘాంశ్ తండ్రి పేరు నిలబెడతారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. మరోవైపు పాటలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా స్టూడెంట్స్‌లో ఈ పాటలు అలరిస్తున్నాయి. ఈ సందర్భాన్ని…
అలియా భట్ సొంత యూ ట్యూబ్ ఛానల్ లాంచ్
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి ఆఫర్లతో దూసుకుపోతుంది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్. కేవలం హిందీ సినిమాల్లోనే కాదు.. తెలుగు సినిమాల్లో కూడా ఆఫర్లను కొట్టేస్తుంది ఈ భామ. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా అలియాను సెలక్ట్ అయిన సంగతి తెలిసిందే.

సాంగ్ చిత్రీకరణలో "సాహో "
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న సాహో మూవీ ప్రపంచవ్యాప్తం గా ఆగస్ట్ 15వ తేదీ కానుంది. ప్రస్తుతం సాహో మూవీ సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆస్ట్రియా లో ఆల్ప్స్ పర్వత శ్రేణి వద్ద ఉన్న టైరోల్ స్టేట్ లో షూటింగ్ కు అనువుగా అతి సుందర ప్రదేశాలు ఉన్నాయి. టైరోల్ స్టేట్ క్యాపిటల్ సిటీ ఇన్స్ బర్క్.
అర్జున్ రెడ్డి మానియా.. ఇప్పుడు కన్నడ కూడా
తెలుగు అర్జున్ రెడ్డి మానియా ఇప్పుడు కబీర్ సింగ్ తో బాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇక్కడ ఈ సినిమాతో సంచనం సృష్టించిన సందీప్ వంగా.. షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈసినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తనయుడు దృవ్ హీరోగా ఆదిత్య వర్మ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.

PSV గరుడ వేగ సీక్వెల్ లో రాజశేఖర్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా రూపొందిన కల్కి మూవీ భారీ అంచనాలతో జూన్ 28 వ తేదీ ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కానుంది. 25 వ తేదీ రిలీజయిన కల్కి మూవీ హానెస్ట్ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండి క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ మూవీ రైట్స్ ను సత్య సాయి ఆర్ట్స్ అధినేత KK రాధామోహన్ సొంతంచేసుకొని రిలీజ్ చేస్తున్నారు. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై రూపొందిన కల్కి మూవీ కి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సౌత్ రీమేక్ మూవీస్ లో బాలీవుడ్ హీరోలు
బాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన దక్షిణాది భాషల మూవీస్ హిందీ రీమేక్ మూవీస్ విజయం సాధించడంతో పాటు , కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల, నిర్మాత, దర్శకుల చూపు దక్షిణాది చిత్ర పరిశ్రమల పై ఉందనడంలో అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కమర్షియల్ ఫెయిల్యూర్స్ లో ఉన్నపుడు ప్రభు దేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి ని హిందీ లో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించి 233 కోట్లు కలెక్ట్ చేసింది. సల్మాన్ హీరోగా తెలుగు మూవీస్ రెడీ, కిక్ హిందీ లో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించాయి. అమీర్ ఖాన్ హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ బ్లాక్…

గ‌్రామీణ నేపథ్యంలో ‘ప్రతి రోజూ పండగే’?
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత సాయి తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `ప్రతి రోజు పండగే`. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మూడు తరాలకు చెందిన వ్యక్తుల (తాత, తండ్రి, మనవడు) మధ్య ఉండే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. తాత, తండ్రి పాత్రల్లో సత్యరాజ్, రావురమేష్ కనిపించనుండగా... మనవడి పాత్రలో సాయి తేజ్ దర్శనమివ్వనున్నాడు. కాగా... హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం (జూన్ 24న) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం... అతిత్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుంది. అంతేకాదు…

సూర్య మూవీ కోసం రాజమౌళి
కెవి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కాప్పాన్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సూర్యకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో... ఇక్కడ కూడా సూర్య సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అలాగే ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. కానీ ఇప్పటివరకూ ఈసినిమా తెలుగు టైటిల్ ను ప్రకటించలేదు దర్శక నిర్మాతలు.

'లా' కి 'ఇజ్జత్' ఇచ్చే కట్టినమ్-లైట్ తీస్కో
'డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో రామ్ పూర్తి హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్ లో అలరించనున్నాడు. దీనిలో భాగంగానే తాను ట్విట్టర్ లో ఏం పోస్ట్ చేసినా ఈ మధ్య అదే స్లాంగ్ లో ట్వీట్ చేస్తున్నాడు కూడా.
పవన్ ఓటమిపై పరుచూరి పలుకులు..!
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత, పపర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజక వర్గాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఓటిమి మాత్రం ఏ ఒక్కరూ ఊహించనిదే. అందరూ రెండు నియోజక వర్గాల్లో ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారనే అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓటమిపాలయ్యారు. అయితే ఇప్పుడు ఈ విషయం పై స్పందించిన పరుచూరి గోపాలకృష్ణ రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న కల్కీ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. మరో మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. దీంతో ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధమైపోయింది.