సెన్సార్ పూర్తిచేసుకున్న కల్కీ

Kalki Movie Censor Report

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. మరో మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. దీంతో ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధమైపోయింది.

కాగా ఈ సినిమాలో రాజశేఖర్ సరసన కథానాయికలుగా ఆదా శర్మ, నందిత శ్వేత నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని, శివాత్మిక సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, దాశరథి శివేంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1983లో జరిగిన మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్నఈచిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. మరి గతంలో పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ చేసిన చాలా సినిమాలు ఆయనకి విజయాలనే తెచ్చిపెట్టాయి. ఆ సెంటిమెంట్ కారణంగా ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంతవరకూ నిలబెడుతుందో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here