ట్యాగ్ · 214 కథనాలు · పేజీ 11
బాధ్యత ఉండక్కర్లా..!
సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!
పెట్ డాగ్స్ తో ప్రిన్స్..అదిరిపోయిన యంగ్ లుక్..!
తనయుడితో మహేష్ బాబు ముచ్చట్లు
మరోసారి క్రేజీ కాంబోలో మూవీ..!

సరిలేరు నీకెవ్వరు - 15 ఇయర్స్ ఆల్ టైం రికార్డ్
మహేష్ ను డైరెక్ట్ చేయాలనుంది..!

TFI వర్కర్స్ కై మహేష్ బాబు ట్వీట్
GMB ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెబ్ సిరీస్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్

"ఓ .. పిట్టకథ"మూవీ టీజర్ రిలీజ్ చేయనున్న మహేష్ బాబు
మీ త్యాగానికి మా సెల్యూట్..!
లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తూ చైనా వైఖరిపై మండిపడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్, నిఖిల్ సిద్దార్థ, అనిల్ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, తదితరులు వీరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌కు మహేష్ బర్త్ డే విషెస్..!
వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భరత్ అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో సినిమాలు తీసి వరుస హిట్స్ కొట్టాడు. అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించివవే. ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం…
బాధ్యత ఉండక్కర్లా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరిగే పరిస్థితులపై కూడా స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా పలు అభిప్రాయాలతో పాటు.. సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు. ఇప్పటికే కరోనా పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా పలు ట్వీట్ లు చేశారు. ఇక ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరోసారి మహేష్ బాబు తన అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చాడు.
సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే నిర్వహిస్తుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. ఆడుతూ పాడుతూ వుండే వీడియోలే కాదు అప్పుడప్పుడు.. ఆ ఛానల్ ద్వారా వీరు సోషల్ అవెర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు.
పెట్ డాగ్స్ తో ప్రిన్స్..అదిరిపోయిన యంగ్ లుక్..!
టాలీవుడ్ ప్రిన్స్, రాజకుమారుడు అంటే వెంటనే గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ అందం పెరుగుతుంది కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. కాలేజ్ స్టూడెంట్ గెటప్ కూడా ఆయన ఇంకా సెట్ అవుతాడని మహర్షి సినిమాలో చేసి చూపించారు. ఇక ఇప్పుడు మహేష్ లుక్ ను చూసిన వారెవరైనా టాలీవుడ్ హీరోనా.. హాలీవుడ్ హీరోనా అన్న డౌట్ రాకుండా మారదు.
తనయుడితో మహేష్ బాబు ముచ్చట్లు
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలతో లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కూతురు సితార తో సినిమాలు చూస్తూ, తనయుడు గౌతమ్ తో కబుర్లు చెబుతూ తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మరోసారి క్రేజీ కాంబోలో మూవీ..!
మహేష్ - త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అభిమానులు ఎదురుచూసే క్రేజీ కాంబినేషన్స్ లో వీరి కాంబినేషన్ కూడా ఉంటుంది. గురూజీ పంచ్ డైలాగ్స్.. మహేష్ నోటి నుండి వస్తే ఆ డైలాగ్స్ ఎలా పేలతాయో చెప్పనక్కర్లేదు. అతడు.. ఆ తర్వాత వచ్చిన ఖలేజా సినిమాలో చూశాం. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. దానికి వేరే కారణాలు కూడా చెపుతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చిన కొన్ని విభేదాల వలన ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రీ యూనియన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.

సరిలేరు నీకెవ్వరు - 15 ఇయర్స్ ఆల్ టైం రికార్డ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసిన సంగతి విదితమే. అయినా కూడా ఇప్పటికీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా బుల్లి తెరపై కూడా ప్రభంజనం సృష్టించింది.
మహేష్ ను డైరెక్ట్ చేయాలనుంది..!
'వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు ఫలక్‌నుమా దాస్ అదే యాక్టర్ విశ్వక్ సేన్. ఇక రీసెంట్ గా నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్.

TFI వర్కర్స్ కై మహేష్ బాబు ట్వీట్
కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు విషమంగా తయారయ్యాయి. ప్రధాని మోదీ ప్రజా శ్రేయస్సు కై 21 రోజులు లాక్ డౌన్ విధించడంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనా మహమ్మారి కట్టడి కై సినీ ప్రముఖులు పిఎమ్, సి ఎమ్ రిలీఫ్ ఫండ్స్ కు భారీగా విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. కోటి రూపాయలు విరాళమిచ్చిన మహేష్ బాబు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ కై 25 లక్షలు విరాళం ఇచ్చారు.

'పోకిరి' రిలీజ్ డేట్ కి మహేష్ నెక్స్ట్ ఫిలిం రిలీజ్ ప్లాన్..!
ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఏం సినిమా చేస్తాడా అన్నది మాత్రం గత కొద్దిరోజులుగా కన్ఫ్యూజన్ గా ఉంది. అయితే ముందు వంశీ పైడి పల్లి తోనే ఉంటుంది అన్నారు. కానీ వీరిద్దరి సినిమా ఇప్పట్లో లేదు. ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మహేష్ తర్వాత సినిమా పరుశురాం తో కానీ... వెంకీ కుడుముల తో కానీ ఉంటుంది. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. అంతేకాదు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.
GMB ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెబ్ సిరీస్?
టాలీవుడ్ లో సక్సెసఫుల్ హీరో గా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ బ్యానరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ భాగస్వామ్యంలో రూపొందిన శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు మూవీస్ ఘనవిజయం సాధించాయి. జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా "మేజర్ "మూవీ రూపొందుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. 2010 సంవత్సరం ఏప్రిల్ నెలలో ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన మహేష్ ఇప్పుడు 90 లక్షల ఫాలోవర్స్ తో రికార్డ్ కియేట్ చేశారు.

"ఓ .. పిట్టకథ"మూవీ టీజర్ రిలీజ్ చేయనున్న మహేష్ బాబు
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చందు ముద్దు దర్శకత్వంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరో గా యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో "ఓ .. పిట్టకథ" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విశ్వంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.