
ట్యాగ్ · 14 కథనాలు


#SSMB 28 మూవీ కొత్త షెడ్యూల్ అప్ డేట్

గౌతమ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్

మహేష్ బాబు ఫౌండేషన్ కొత్త కార్యక్రమం

గాయపడిన బుట్టబొమ్మ

"#SSMB 28" మూవీ అప్ డేట్

చిన్నారుల గుండె ఆపరేషన్స్ పై మహేష్ బాబు స్పందన

#SSMB 28.. వర్క్ అండ్ చిల్

'మహేష్' సినీ ప్రస్థానానికి 42 ఏళ్లు..!

సినిమా , నటన అంటే ప్రాణం- పూజాహెగ్డే

గ్రాండ్ గా పూజాహెగ్డే బర్త్ డే

'#SSMB28' అనౌన్స్ మెంట్ వచ్చేసింది

మహేష్ సినిమాలో మరింత క్రూరంగా
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

#SSMB 28 మూవీ కొత్త షెడ్యూల్ అప్ డేట్
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ ఆగష్టు 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ఉగాది కి మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.

గౌతమ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్
కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగిగా పేరు తెచ్చుకొని అన్ని విషయాల్లోనూ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ పిల్లలు కూడా తండ్రికి తగ్గ పిల్లలుగా ఇప్పుడే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. నిజానికి సితార, గౌతమ్ లలో సితార యాక్టివ్ అని చెప్పొచ్చు. తను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. అయితే గౌతమ్ మాత్రం కాస్త సైలెంట్. సోషల్ మీడియాకు కూడా తను దూరమే. అప్పట్లో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు.. ఆ తరువాత మాత్రం స్క్రీన్ పై కనిపించలేదు. ఇక నమ్రత కూడా సోషల్…

మహేష్ బాబు ఫౌండేషన్ కొత్త కార్యక్రమం
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 మూవీలో నటిస్తున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాదిరిగా మహేష్ బాబు తన సంపాదనలో కొంతభాగాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు.

సితార డ్యాన్స్ వీడియో తో మహేష్ బాబు దీపావళి శుభాకాంక్షలు
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతుంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ మహేష్ బాబు అభిమానులను అలరిస్తున్నారు.

గాయపడిన బుట్టబొమ్మ
ప్రస్తుతం దేశంలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఆ లిస్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ముందు ఉంటుంది. ఇప్పటికే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే తెలుగుతో పాటు తమిళ్, అలానే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమాతో మొదట సక్సెస్ ను అందుకున్న పూజాహెగ్డే ఆ తరువాత పెద్దగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస హిట్లను అందుకుంటూ లక్కీ హీరోయిన్ అయింది. ఇక ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా త్వరలో తను నటించిన ఆచార్య సినిమా అలానే బీస్ట్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నాయి.

"#SSMB 28" మూవీ అప్ డేట్
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 ”మూవీ పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న “#SSMB 28″మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

చిన్నారుల గుండె ఆపరేషన్స్ పై మహేష్ బాబు స్పందన
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "#SSMB 28 " మూవీ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ బాబు తన సంవత్సర ఆదాయంలో 30శాతం సేవాకార్యక్రమాలకై వెచ్చిస్తున్నారు. ఎంతో మంది చిన్నారుల ఆరోగ్యానికి అవసరమయ్యే ఖర్చులను భరిస్తూ సేవలు అందిస్తోన్న మహేష్ బాబు 1000 మందికి పైగా చిన్నారుల గుండె ఆపరేషన్స్ కు సహాయం అందించారు.

#SSMB 28.. వర్క్ అండ్ చిల్
ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మహేష్ మోకాలికి సర్జరీ అవ్వడంతో షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. నిజానికి మెుదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు.. కానీ ఆతరువాత ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కన్నడ అమ్మాయి గా గుర్తింపు పొందడమే ఇష్టం- పూజాహెగ్డే
తమిళంలో "ముగమూడి ", తెలుగులో ‘ఒక లైలా కోసం’, హిందీలో ‘మొహంజోదారో’ చిత్రాలతో పూజాహెగ్డే కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” , "#PSPK 28" మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

'మహేష్' సినీ ప్రస్థానానికి 42 ఏళ్లు..!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా నెంబర్ వన్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తన నటనతో.. ప్రయోగాత్మక సినిమాలతో ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. ఇక టాలీవుడ్ లో అందగాడు ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు మహేష్. అందుకే టాలీవుడ్ రాకుమారుడు అయ్యాడు.

సినిమా , నటన అంటే ప్రాణం- పూజాహెగ్డే
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే వరుస అవకాశాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలీవుడ్ లో "సర్కస్ ","భాయిజాన్ ", కోలీవుడ్ లో "బీస్ట్ " మూవీ లో నటిస్తున్నారు. "#SSMB 28 " మూవీ లో పూజా కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.ప్రస్థుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా సక్సెస్ ను పూజాహెగ్డే ఎంజాయ్ చేస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

గ్రాండ్ గా పూజాహెగ్డే బర్త్ డే
తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "ఆచార్య ", "రాధేశ్యామ్" మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం "సర్కస్ ", "భాయిజాన్ "(హిందీ ) "బీస్ట్ "(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. "#SSMB28" మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

'#SSMB28' అనౌన్స్ మెంట్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి తివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రావాలి. ఈసినిమా ఎప్పుడో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అన్నారు. కానీ ఎమైందో కానీ మహేష్ సినిమా మధ్యలోకి వచ్చింది. ఎన్టీఆర్-కొరటాల సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.