గౌతమ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్

Namrata Shirodkar Gautam School Stage Performance, Gautam School Stage Performance, Namrata Shirodkar, Mahesh Babu, Samyuktha Menon, Pooja Hegde, Trivikram Srinivas, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movies, Mahesh Babu Movies, SSMB 28, SSMB 28 2023, SSMB 28 Movie, SSMB 28 Telugu Movie, SSMB 28 Update, SSMB 28 News, SSMB 28 Latest News, SSMB 28 New Update, SSMB 28 Movie Live Updates, SSMB 28 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగిగా పేరు తెచ్చుకొని అన్ని విషయాల్లోనూ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ పిల్లలు కూడా తండ్రికి తగ్గ పిల్లలుగా ఇప్పుడే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. నిజానికి సితార, గౌతమ్ లలో సితార యాక్టివ్ అని చెప్పొచ్చు. తను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. అయితే గౌతమ్ మాత్రం కాస్త సైలెంట్. సోషల్ మీడియాకు కూడా తను దూరమే. అప్పట్లో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు.. ఆ తరువాత మాత్రం స్క్రీన్ పై కనిపించలేదు. ఇక నమ్రత కూడా సోషల్ మీడియాలో కాస్త యాక్టీవ్ గానే ఉంటుంది. సితార, గౌతమ్, మహేష్ కు సంబంధించిన అప్ డేట్స్ ను కానీ ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు నమ్రత తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా నమ్రత గౌతమ్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. గౌతమ్ తన స్కూల్లో నాటకం వేశాడు. దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ.. గౌతమ్ లవ్వులో పెద్ద ఎక్స్‌పర్ట్ ఏమీ కాదు..కానీ అతని ఫ్రెండ్స్ మాత్రం అందులో ఆరితేరిపోయారు. హై స్కూల్లో గౌతమ్ మొదటి సారిగా ఇలా స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. గౌతమ్ తన స్టైల్లో అదరగొట్టేశాడు.. ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాలి మై బాయ్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. లవ్యూ సో మచ్ అంటూ నమ్రత సంతోషంతో మురిసిపోతూ పోస్ట్ లో పేర్కొంది. ఇక దీనిపై మహేష్ అభిమానులు కూడా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seventeen =