
ట్యాగ్ · 14 కథనాలు


సిద్దు జొన్నలగడ్డ సినిమా పేరు మారింది

అదిరిపోయే కాన్సెప్ట్ తో టిల్లు క్యూబ్

కన్ఫామ్.. టిల్లూ కి జోడీగా బెేబి బ్యూటీ

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా

జోరు మీదు DJటిల్లూ.. మరో సినిమా లాంచ్

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

సుకుమార్ రైటింగ్స్ లో సిద్దూ

'డీజే టిల్లు' ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నటీనటులను గౌరవించండి.. 'డీజే టిల్లు' రిక్వెస్ట్..!

సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్న 'డీజే టిల్లు'

కప్పేల రీమేక్ లాంచ్ చేసిన త్రివిక్రమ్

ఈ సినిమా థీమ్ చాలా ఫ్రెష్‌గా వుంటుంది
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీల'. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ అయింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

సిద్దు జొన్నలగడ్డ సినిమా పేరు మారింది
స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 'కృష్ణ అండ్ హిజ్ లీల' 2020 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటించిగా.. సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో కనిపించారు. వైవా హర్ష, ఝాన్సీ, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ మేరకు ఆయన తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

అదిరిపోయే కాన్సెప్ట్ తో టిల్లు క్యూబ్
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ మాత్రం ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీనికి కారణం ఏంటో స్పెషల్ గా చెప్పాల్సిన పనికూడా లేదు. తాను హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. నిజానికి ఈసినిమాపై ముందు నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తుంది కాబట్టి. దాంతో మొదటినుండీ ఎక్స్ పెక్టేషన్స్ హై గానే ఉన్నాయి. దానికి తగ్గట్టు అప్ డేట్లు కూడా మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఫైనల్ గా మార్చి 29వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. సిద్దు సూపర్ పెర్ఫార్మన్స్…

టిల్లు స్క్వేర్‌లో చాలా సర్‌ప్రైజ్‍లు ఉన్నాయి - సిద్ధు జొన్నలగడ్డ
ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే 'టిల్లు స్క్వేర్' అని చెప్పవచ్చు. 'టిల్లు స్క్వేర్' చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

కన్ఫామ్.. టిల్లూ కి జోడీగా బెేబి బ్యూటీ
షార్ట్ ఫిలింస్ తో కెరీర్ ను మొదలుపెట్టిన వైష్ణవి బేబి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. ఇక ఆసినిమా సక్సెస్ తో వైష్ణవి ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే ఆశిష్ రెడ్డి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఈసినిమా రాబోతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమాకు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా
బ్లాక్ బాస్టర్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.ఈసినిమాఫై మంచి అంచనాలు వున్నాయి.అయితే ఇంతకుముందు ఈసినిమాను సెప్టెంబర్ 15న విడుదలచేయాలని మేకర్స్ భావించారు.ఈ డేట్ ను అఫీషియల్ గా కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి విడుదలచేయలేకపోతున్నారు.దాంతో విడుదల వాయిదా పడింది.

జోరు మీదు DJటిల్లూ.. మరో సినిమా లాంచ్
ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ తో…

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం డీజే టిల్లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా పేరుతెచ్చుకున్న ఈ సీక్వెల్, టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో వస్తుంది. ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో వుంది.

సుకుమార్ రైటింగ్స్ లో సిద్దూ
ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన డీజే టిల్లు తో సిద్దు క్రేజ్ కూడా బాగానే పెరిగింది. సిద్దుతో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం అయితే సిద్దూ డీజే టిల్లు సీక్వెల్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. అనుపమా పరమేశ్వరనే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

'డీజే టిల్లు' ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్
సిద్దూ హీరోగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం డీజే టిల్లు. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా యూత్ ఫుల్ కంటెంట్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిన తరువాత మళ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు.. అయినా కూడా ఈసినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమాను ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నారు…

నటీనటులను గౌరవించండి.. 'డీజే టిల్లు' రిక్వెస్ట్..!
సినిమా ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు రిపోర్టర్స్ నుండి అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతుంటాయి హీరో హీరోయిన్స్ కు. ఇక కొంతమంది వాటిని ఇగ్నోర్ చేస్తే.. కొంతమంది ఓపికగా సమాధానం చెబుతుంటారు. ఇకఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది యంగ్ హీరో సిద్దూకి. సిద్దూ హీరోగా వస్తున్న కొత్త సినిమా డీజే టిల్లు. ఇక ఈసినిమా ఈనెలలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్‌లో హీరోయిన్ పుట్టు మచ్చలపై ఓ రిపోర్టర్ సిద్దూను ప్రశ్న అడుగగా దానిని సిద్దూ చాలా స్మూత్ గా…

సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్న 'డీజే టిల్లు'
కరోనా థర్డ్ వేవ్ వల్ల సినీ పరిశ్రమకు మళ్లీ బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అనుకునే లోపే మళ్లీ థర్డ్ వేవ్ ప్రభావం పెరిగిపోతుంది. రోజు రోజుకి కేసులు పెరిగిపోతుండటంతో మళ్లీ లాక్ డౌన్ లు మొదలయ్యాయి. ఇక మరోవైపు థియేటర్లు కూడా మూసేస్తున్నారు. దీంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇప్పటికే పెద్ద సినిమాలు తప్పుకున్నాయి.. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా వాయిదాల పర్వం మొదలుపెట్టాయి. ఇప్పటికే 7డేస్ 6నైట్స్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడు మరో సినిమా ఈ రేస్ నుండి తప్పుకుంది.

కప్పేల రీమేక్ లాంచ్ చేసిన త్రివిక్రమ్
‘ప్రేమమ్’, ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తరవాత సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న మరో మాలయాళ సినిమా రీమేక్ కప్పేల. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఫిదా చేసేశారు. 2020 లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాల జాబితాలో ఈసినిమా కూడా ఒకటి. ఇక ఇప్పుడు ఈసినిమాను కూాడా రీమేక్ చేస్తున్నారు.