యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ మాత్రం ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీనికి కారణం ఏంటో స్పెషల్ గా చెప్పాల్సిన పనికూడా లేదు. తాను హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. నిజానికి ఈసినిమాపై ముందు నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తుంది కాబట్టి. దాంతో మొదటినుండీ ఎక్స్ పెక్టేషన్స్ హై గానే ఉన్నాయి. దానికి తగ్గట్టు అప్ డేట్లు కూడా మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఫైనల్ గా మార్చి 29వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. సిద్దు సూపర్ పెర్ఫార్మన్స్ డైరెక్టర్ మల్లిక్ రామ్ టేకింగ్ ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు టిల్లు క్యూబ్ ని లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా దీనికి సీక్వెల్ గా త్వరలో టిల్లు క్యూబ్ మూవీ కోసం ఒక పాయింట్ ఆలోచన చేస్తున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా దీనిపై హీరో సిద్దు కూడా మాట్లాడుతూ సూపర్ అప్ డేట్ ఇచ్చాడు. టిల్లు గాడు సూపర్ హీరో అయితే ఎలా బిహేవ్ చేస్తాడో, ఎలా ఉంటాడో అనే దాని మీద సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. త్వరలో దానికి సంబంధించి పూర్తి స్టోరీ, స్క్రిప్ట్ డెవలప్ చేసి చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.
మరోవైపు టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. రోజు రోజుకి కలెక్షన్స్ ను సాలిడ్ గా పెంచుకుంటూ పోతుంది. కేవలం నాలుగు రోజుల్లోనే 78 కోట్లు కలెక్ట్ చేసిన ఈసినిమా మరో రెండు మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























