షార్ట్ ఫిలింస్ తో కెరీర్ ను మొదలుపెట్టిన వైష్ణవి బేబి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. ఇక ఆసినిమా సక్సెస్ తో వైష్ణవి ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే ఆశిష్ రెడ్డి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఈసినిమా రాబోతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమాకు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమా ఛాన్స్ ను కొట్టేసింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా వస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఓ బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు.
Wishing talented and beautiful leading lady @iamvaishnavi04, a very happy birthday!🎉
Can’t wait for the world to see your magic in #SVCC37!
Star boy #SiddhuJonnalagadda @baskifilmz @SVCCofficial #TeluguFilmNagar pic.twitter.com/rq7hoLOxAv
— Telugu FilmNagar (@telugufilmnagar) January 4, 2024
కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: