సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

Star Boy Siddhu Jonnalagadda Meets Telangana CM Revanth Reddy

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ మేరకు ఆయన తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటిన సిద్ధుజొన్నలగడ్డను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. సిద్దు ఈ ఏడాది ‘టిల్లు స్క్వేర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరిశారు. ప్రస్తుతం ఆయన నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ‘తెలుసు కదా’ అనే మూవీలో నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.