స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ 2020 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటించిగా.. సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో కనిపించారు. వైవా హర్ష, ఝాన్సీ, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ లాక్‌డౌన్ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. కాకపోతే ఈ సినిమాను ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా దీనికి సంబంధించి నిర్మాత రానా దగ్గుబాటి కీలక ప్రకటన చేశారు.
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. అయితే ఈ సినిమా టైటిల్ మారిందని, కానీ.. ఎందుకు మార్చాల్సి వచ్చిందో అడగొద్దని.. అది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ అని పేర్కొన్నారు. కాగా ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























