ట్యాగ్ · 113 కథనాలు · పేజీ 6
మహేష్ ఫ్యాన్స్ కు పండగే అంటున్న పూరీ

కన్ఫామ్.. 'మహేష్' కు జోడిగా 'మహానటి'
దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సర్కారు వారి పాట'
గత ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. కరోనా వల్ల ఈ ఏడాది మాత్రం స్కిప్ చేసినట్టే. కరోనా వల్ల గత ఏడాది షూటింగ్ లు కూడా లేకపోవడంతో ఈ ఏడాది రావాల్సిన సినిమా వచ్చే ఏడాదికి వెళ్ళింది. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 27వ సినిమాగా రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. 'గీత గోవిందం' సినిమా తర్వాత పరుశురాం చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక గత కొద్దికాలంగా ఈ సినిమా దుబాయ్ లో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే కదా. సినిమాకు చాలా కీలకమైన ఎపిసోడ్స్ కొన్ని ఇక్కడే చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ…
'సర్కారు వారి పాట' - ఆగష్ట్ లో కలుద్దాం
టాలీవుడ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ ఎవరంటే ప్రస్తుతం థమన్ పేరు వినిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలే ఫుల్ ఫామ్ లో ఉన్న థమన్ ను అల వైకుంఠపురములో సినిమా ఇంకో మెట్టు ఎక్కించింది. ఇక పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేకుండా థమన్ కూడా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం థమన్ ఖాతాలో ఎన్ని సినిమాలు ఉన్నాయో కూడా చెప్పడం కష్టమే. ఇక థమన్ కూడా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాడు. రెండు రోజుల క్రితమే వకీల్ సాబ్ సినిమా ఆల్బమ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. మార్చిలో వకీల్ సాబ్ సినిమా మ్యూజికల్ ట్రీట్ ఉంటుందని తెలిపాడు.
'సర్కారు వారి పాట' మూడో కంపోజిషన్ కంప్లీట్
వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు థమన్. దాదాపు డజనుకు పైగా సినిమాలు థమన్ ఖాతాలో ఉన్నాయి. ఇక తన వర్క్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాడు. ప్రస్తుతం థమన్ సర్కారు వారి పాట సినిమా మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇకతాజాగా ఈ సినిమా పాటలకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు.ఈసినిమాకు సంబంధించి మూడో కంపొజిషన్ సెషన్స్ కంప్లీట్ అయ్యాయని.. డైరెక్టర్ పరుశురాం.. సినిమాటోగ్రాఫర్ మది తో ఉన్న ఫొటో ను పోస్ట్ చేసాడు.
'సర్కారు వారి పాట' లొకేషన్స్ కు మహేష్ ఫిదా
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడి షూటింగ్ కు సంబంధించి పలు ఫొటోలు.. లొకేషన్స్ కు సంబందించిన ఫొటోలు ఇప్పటికే మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా అవి వైరల్ అవుతున్నాయనుకోండి.
2022 సంక్రాంతికి వచ్చేస్తున్న 'సర్కారు వారి పాట'
వరుస పెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. గత ఏడాది కరోనా వల్ల పెండింగ్ లో ఉన్న సినిమా రిలీజులన్నీ ఈఏడాది క్యూ కట్టాయి. ఇప్పటికే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఫిబ్రవరి, మార్చికి చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరో సర్పైజింగ్ అప్ డేట్ ఇచ్చారు 'సర్కారు వారి పాట' చిత్ర యూనిట్. మహేష్ సర్కారు వారి పాట ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఇటీవలే కాస్త ఊరట కలిగింది. ఈసినిమా షూటింగ్ ను ఈ మధ్యనే ప్రారంభించారు. దుబాయ్ లోప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
'సర్కారు వారి పాట' ఖాతాలో మొదటి రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డ్స్ కొత్త కాదు. సినిమాల పరంగా కానీ.. సోషల్ మీడియా పరంగా కానీ ఒక్క విభాగంలో కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
'సర్కారు వారి పాట' షూటింగ్ మొదలు
మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సర్కారు వారి పాట చిత్రయూనిట్. కరోనా వల్ల కొన్ని నెలలుగా షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. ఎలాగొలా గత కొద్దికాలంగా షూటింగ్ లు మొదలవుతున్నాయి. అందరు హీరోలు సినిమా షూటింగ్ లు మొదలు పెట్టడంతో తమ హీరో ఎప్పుడు మొదలు పెడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఇప్పటికే చిత్రయూనిట్ దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ రోజునుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో ఈ మూవీ షూటింగ్ అధికారికంగా మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్‌లో ఓ…
'దుబాయ్' లో సర్కారు వారి పాట
గత ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ వెంటనే 'సర్కారు వారి పాట' సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ మాత్రం ఇన్నిరోజులు పెండింగ్ లో పడిపోయింది. ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్లు మొదలు పెట్టి పూర్తి చేసి కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి.
మహేష్ ఫ్యాన్స్ కు పండగే అంటున్న పూరీ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. ఈ సినిమాను అధికారికంగా ఈరోజు లాంచ్ చేశారు. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూలర్ షూట్ జనవరి మొదటి వారం నుండి జరగనుంది. 2021 దసరాకు సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు.
'సర్కారు వారి పాట' గ్రాండ్ లాంచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మహేష్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా వాటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు.

2021 జనవరి నుండి 'సర్కారు వారి పాట'..!
ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయాడు. అయితే తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. అయితే ఈ మధ్యనే షూటింగ్ లు మొదలుపెట్టారు. చాలా సినిమాలు చివరిదశలోనే ఉండగా ముందు వారు మాత్రం షూటింగ్ లను మొదలుపెట్టి పూర్తి చేసుకున్నారు.
'సర్కారు వారి పాట' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాకు రెడీ అవుతున్నాడు. అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కన్ఫామ్.. 'మహేష్' కు జోడిగా 'మహానటి'
మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో గతకొద్ది రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. ముందుగా మహేష్ తో భరత్ అనే నేను చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకుంటున్నారన్న టాక్స్ వినిపించాయి. ఆ తర్వాత ‘దబాంగ్ 2’ ఫేమ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపించాయి. అందులో కూడా నిజం లేదని తెలిసింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేషే నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో మాట్లాడిన కీర్తి ఈ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పకనే…