‘సర్కారు వారి పాట’ – ఆగష్ట్ లో కలుద్దాం

Thaman Took To Twitter About Sarkaru Varri Paata Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,SS Thaman,SS Thaman Latest News,Music Director SS Thaman,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Update,Sarkaru Vaari Paata Latest Updates,Sarkaru Vaari Paata Movie Update,Sarkaru Vaari Paata Movie Latest News,SS Thaman Promises Music Updates For Sarkaru Vaari Paata,Music Updates For Sarkaru Vaari Paata In August,Sarkaru Vaari Paata Music Update,Sarkaru Vaari Paata Music In August,Thaman Shares Update About Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Music,Superstar Mahesh Babu

టాలీవుడ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ ఎవరంటే ప్రస్తుతం థమన్ పేరు వినిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలే ఫుల్ ఫామ్ లో ఉన్న థమన్ ను అల వైకుంఠపురములో సినిమా ఇంకో మెట్టు ఎక్కించింది. ఇక పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేకుండా థమన్ కూడా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం థమన్ ఖాతాలో ఎన్ని సినిమాలు ఉన్నాయో కూడా చెప్పడం కష్టమే. ఇక థమన్ కూడా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాడు. రెండు రోజుల క్రితమే వకీల్ సాబ్ సినిమా ఆల్బమ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. మార్చిలో వకీల్ సాబ్ సినిమా మ్యూజికల్ ట్రీట్ ఉంటుందని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక థమన్ సర్కారు వారి పాట సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే సర్కారు వారి పాట మూడో కంపోజిషన్ కంప్లీట్ అయిందని తెలపగా.. ఇప్పుడు తాజాగా సర్కారు వారి పాట సినిమా పాటల గురించి మరో అప్ డేట్ ఇచ్చాడు. మహేష్ సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ కూడా కొంచం ఇవ్వమని అడుగగా.. దానికి థమన్ తన ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చాడు. బ్రదర్ సర్కారు వారి పాటకు ఇంకా చాలా టైం ఉంది.. కానీ బుల్లెట్ కరెక్ట్ గా దింపేద్దాం ఈ సారి.. అదైతే ఫిక్స్ అయ్యా.. 2022 సంక్రాంతి కదా ఆగష్ట్ లో కలుద్దాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

 

కాగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అంటే 2022 జనవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =