
ట్యాగ్ · 277 కథనాలు


శుభం రిలీజ్ డేట్ ప్రకటించిన సమంత

సమంత నిర్మిస్తున్న 'శుభం' టీజర్ రిలీజ్

నటి సమంత ఇంట తీవ్ర విషాదం

సిటాడెల్ హనీ బన్నీ టీజర్ రిలీజ్

రీ రిలీజ్‌కి సిద్దమైన 'ఎటో వెళ్లిపోయింది మనసు'

సెన్సార్ పూర్తి చేసుకున్న ఖుషి

ఏ మాయ చేశావే రోజులను గుర్తుచేసుకున్న సమంత

న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న సమంత

తన కోసం 10 ఏళ్లు అయినా వెయిట్ చేసేవాళ్లం

25 కోట్లపై సమంత కౌంటర్

బాలి ట్రిప్ ఎంజాయ్ మెంట్ లో సామ్

శుభం టీంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె 'శుభం' చిత్ర యూనిట్‌తో కలిసి కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమంత బృందానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

శుభం రిలీజ్ డేట్ ప్రకటించిన సమంత
ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం.

సమంత నిర్మిస్తున్న 'శుభం' టీజర్ రిలీజ్
ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం.

మళ్ళీ ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఎటో వెళ్లిపోయింది మనసు
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి సరికొత్తగా ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

నటి సమంత ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటి సమంత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ మేరకు విషయాన్ని సమంత స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ స్టేటస్‌ను పోస్ట్ చేసి దానికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన తెలుగు సినీ పరిశ్రమ
టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య-సమంత విడాకులకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహిళామంత్రి కామెంట్లను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది.

ఐఫా అవార్డుల వేడుకలో మెరిసిన టాలీవుడ్ సెలబ్రిటీలు
భారతీయ సినిమా రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక ఘనంగా మద్దలైంది. అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సిటాడెల్ హనీ బన్నీ టీజర్ రిలీజ్
రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇదే వెబ్ సిరీస్ ను ఇండియన్ వెర్షన్ లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. రాజ్ అండ్ డీ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. సిటాడెల్ హనీ బన్నీ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

రీ రిలీజ్‌కి సిద్దమైన 'ఎటో వెళ్లిపోయింది మనసు'
ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన చిత్రాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూ ఉంటాయి. నాని, సమంత కలిసి చేసిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు.

‘ఖుషి’లో సమంతను తీసుకోవడానికి అదే కారణం - శివ నిర్వాణ
టాలీవుడ్‌లోని సెన్సిబుల్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో ఆయనది అందె వేసిన చేయి. శివ నిర్వాణ ఇంతకుముందు తెరకెక్కించిన 'నిన్ను కోరి', 'మజిలీ', 'టక్ జగదీశ్' సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు…

ఖుషి నుండి 5వ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి మరో 6 రోజుల్లో థియేటర్లోకి రానుంది.ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అవ్వడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా వుండడడంతో సినిమాఫై అంచనాలు పెరిగిపోయాయి.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ హైప్ తగ్గట్లే జరిగింది.లైగర్,విజయ్ మార్కెట్ ను ఏ విధంగా ప్రభావితం చేయలేకపోయింది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఖుషి
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ అదరగొట్టింది.ప్రస్తుతం విజయ్ ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా విడుదలవుతుండడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది.అయితే ఖుషికి రన్ టైం కొంచెం ఎక్కువగానే వుంది.దాదాపు 2గంటల 45నిమిషాల నిడివితో రానుంది.

ఏ మాయ చేశావే రోజులను గుర్తుచేసుకున్న సమంత
టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు (సామ్) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో పాల్గొంది. అనంతరం అక్కడ హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో సమంత లోకల్‌గా ఉన్న పలు ఫేమస్ ప్లేసెస్‌ను విజిట్ చేస్తూ సందడి చేస్తోంది. అలాగే తన ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటోంది. కాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ నటి అయిన సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తన యాక్టింగ్ కెరీర్‌కు విరామం ఇచ్చిన…

న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న సమంత
అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న 41వ 'ఇండియా డే పరేడ్'లో ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు పాల్గొన్నారు. కాగా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వేడుకలు ఆదివారం మధ్యాహ్నం ఘనంగా జరిగాయి. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో నటి సమంతతో పాటు మరికొంతమంది భారతీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, బాలీవుడ్ నటి, మోడల్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమంత న్యూయార్క్ వీధుల్లో నడుస్తూ ప్రేక్షకులకు చేతులు ఊపుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన భారతీయుల…

'ఖుషి' మ్యూజిక్ కాన్సర్ట్‌లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ నటి సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. రోమ్ కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్, సమంత భార్య, భర్తలుగా నటించారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. 'హల్లో హైదరాబాద్, ఈ సినిమా కోసం చాలా ఓపికగా ఎదురు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అభిమానులు ఇక్కడ ప్రత్యక్షంగా పాటలను చూసి ఎంజాయ్ చేయడాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా…

సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉంది - విజయ్ దేవరకొండ
నటి సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉందని అన్నారు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 15, 2023) హైదరాబాద్‌లో జరిగిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి 'ఖుషి' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న నా తరుపున ఖుషి తీసుకొస్తున్నా. చివరిగా అందరికీ ఖుషి…

తన కోసం 10 ఏళ్లు అయినా వెయిట్ చేసేవాళ్లం
ఆమె కోసం పదేళ్లయినా వెయిట్ చేసేవాళ్లం అంటున్నారు ఖుషి చిత్రయూనిట్. మరి ఇంతకీ ఆమె ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా ఖుషి. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అన్నప్పుడే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలను ఏర్పడ్డాయి. అందులోనూ అప్పటికే మహానటి సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడటంతో ఈసినిమాను ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులను ముగించుకుంటుంది.

25 కోట్లపై సమంత కౌంటర్
ఎంత సైలెంట్ గా ఉన్నా కొంతమంది హీరోయిన్స్ పై ఏదో ఒక రూమర్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సమంత పై కూడా అలాంటి ఒక రూమరే చక్కర్లు కొడుతుంది. మరి సమంత గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా కౌంటర్ ఇవ్వడంలో కానీ.. తను అనుకున్నది ఎలాంటి మొహమాాటం లేకుండా ధైర్యంగా బయటకు చెప్పడంలో కానీ ఎక్పర్ట్. ఈనేపథ్యంలోనే తనపై వచ్చిన రూమర్ కు సాలిడ్ కౌంటర్ ఇచ్చింది.

బాలి ట్రిప్ ఎంజాయ్ మెంట్ లో సామ్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇండస్ట్రీలో దాదాపు శబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది సమంత . నిజానికి కెరీర్ సాఫీగా సాగుతున్నప్పుడు హీరోయిన్స్ ఏమాత్రం బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉండరు. కానీ సామ్ మాత్రం అందుకు విరుద్దం. తను ఏం చేయాలను కుంటుందో అదే చేసే అలవాటు ముందు నుండీ సామ్ కు ఉంది. అందుకే ప్రస్తుతం బిజీగా ఉన్నా కూడా ఒక ఏడాది పాటు షూటింగ్ లకు బ్రేక్ చెప్పేసింది. ఇక ఈ బ్రేక్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో తను చేసిన పోస్ట్ లను బట్టి చెప్పొచ్చు ఎంత ఎంజాయ్ చేస్తుందో.

ఖుషి టైటిల్ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ,సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఖుషి.షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు విడుదలైన రెండు సాంగ్స్ చార్ట్ బాస్టర్ అయ్యాయి.మొదటి పాట నా రోజా నువ్వే అయితే అన్ని భాషల్లో కలిపి 100మిలియన్ల వ్యూస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.సెకండ్ సాంగ్ ఆరాధ్య కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.ఇక ఇప్పుడు మూడో సాంగ్ గా ఖుషి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.