
ట్యాగ్ · 13 కథనాలు


షూటింగ్ చివరి దశలో సలార్

ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు ఫిక్స్

సోషల్ మీడియాకు ప్రశాంత్ నీల్ దూరం

సలార్ షూటింగ్ పై పృథ్వీరాజ్ అప్ డేట్

"సలార్" మూవీ లో ప్రభాస్ కై స్పెషల్ జీప్

'సలార్' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!

"సలార్ "మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన
"సలార్" మూవీ హీరోయిన్ దిశా పటాని ?
"సలార్" మూవీ ఆడిషన్స్

సలార్ కోసం అందుకే ప్రభాస్ ను తీసుకున్నా

సలార్ తమిళ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది ఈసినిమా. ఇక ఈసినిమా రిలీజ్ పై పలు రూమర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ఈసినిమా చెప్పిన తేదీకే అంటే డిసెంబర్ 22వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

హ్యాట్రిక్ దిశగా సంక్రాంతి లక్కీ హీరోయిన్ శృతి హాసన్
తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి12 వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఒకే బ్యానర్ లో తెరకెక్కిన ఈ…

షూటింగ్ చివరి దశలో సలార్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు…

ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు ఫిక్స్
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.. వాటికోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈమధ్య కాలంలో అలాంటి కాంబినేషన్స్ కూడా ఎన్నో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి రాబోతుంది. అదే దిల్ రాజు-ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ప్రస్తుతం దిల్ రాజు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగు లో మాత్రమే కాదు అటు తమిళ్ ఇంకా హిందీ పరిశ్రమలపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు కన్నడ డైరెక్టర్ ను లైన్ లో పెట్టేశాడు.

సోషల్ మీడియాకు ప్రశాంత్ నీల్ దూరం
సెలబ్రిటీలు అప్పుడుప్పుడు సోషల్ మీడియో నుండి దూరమవుతుంటారు. కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల.. కొంతమంది కావాలని బ్రేక్ తీసుకోవడానికి సోషల్ మీడియాలో డియాక్టివేటివ్ అవుతుంటారు. ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కె.జియఫ్ సిరీస్ తో సినిమాతో ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనులో ఉన్నారు చిత్రయూనిట్.

సలార్ షూటింగ్ పై పృథ్వీరాజ్ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఒక ప్రభాస్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ తప్పా మరొకటి రాలేదు. చాలా కాలంగా ఈసినిమా నుండి అప్ కోసం ఫ్యాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ అప్ డేట్ మాత్రం ఇంతవరకూ రాలేదు. ఈసినిమాలో పృథ్విరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.

ప్రభాస్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇంటింట దీపావళి (1990 ) మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈశ్వరీ రావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. విరుంబిగిరేన్, కాలా తమిళ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈశ్వరీరావు బెస్ట్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డ్స్ అందుకున్నారు.

"సలార్" మూవీ లో ప్రభాస్ కై స్పెషల్ జీప్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర లో…

'సలార్' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
ప్రస్తుతం ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక పాన్ ఇండియా సినిమా అంటే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పడుతుందన్న సంగతి కూడా విదితమే. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అయితే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నిజానికి ఆదిపురుష్ కంటే సలార్ సినిమానే ముందు మొదలైంది. కానీ ప్రభాస్ సలార్ కు గ్యాప్ ఇచ్చి ఆదిపురుష్ సినిమాను పూర్తి చేశాడు. దీంతో సలార్ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ…

"సలార్ "మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "సలార్" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. "సలార్" మూవీలో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికై దర్శక , నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. హెదరాబాద్ , చెన్నై , బెంగళూరు లలో ఆడిషన్స్ నిర్వహించి కొత్త టాలెంట్ కు అవకాశం కల్పించడానికై దర్శకుడు ప్రకటించారు. ఏ వయస్సు వారైనా , ఏ భాష వారైనా ఆడిషన్స్ లో పాల్గొన వచ్చునని తెలిపారు.
"సలార్" మూవీ హీరోయిన్ దిశా పటాని ?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "లోఫర్ " మూవీ తో దిశా పటాని కెరీర్ ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ "ఎమ్ ఎస్ ధోని -ది అన్ టోల్డ్ స్టోరీ " మూవీ తో బాలీవుడ్ లో దిశాపటాని అడుగుపెట్టారు. దిశా పటాని కథానాయిక గా నటించిన "బాఘీ 2", "భారత్ ", "మలంగ్ "హిందీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న "రాధే " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
"సలార్" మూవీ ఆడిషన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "రాధేశ్యామ్ " మూవీ తరువాత ప్రభాస్ "ఆదిపురుష్ ", నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్ "మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

సలార్ కోసం అందుకే ప్రభాస్ ను తీసుకున్నా
ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇక ఇది సెట్స్‌లో ఉండగానే ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ‘సలార్’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.