ప్రస్తుతం ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక పాన్ ఇండియా సినిమా అంటే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పడుతుందన్న సంగతి కూడా విదితమే. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అయితే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నిజానికి ఆదిపురుష్ కంటే సలార్ సినిమానే ముందు మొదలైంది. కానీ ప్రభాస్ సలార్ కు గ్యాప్ ఇచ్చి ఆదిపురుష్ సినిమాను పూర్తి చేశాడు. దీంతో సలార్ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదే ఈసినిమా వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈసినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పటివరకూ ఈ సినిమా 30 శాతం వరకూ షూటింగ్ ను జరుపుకుంది. మే నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాము అని క్లారిటీ ఇచ్చారు.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























