కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sai Dharam Tej New Movie News

ట్యాగ్ · 13 కథనాలు

SDT14 Movie Team Releases An Interesting Update
సినిమా వార్తలు

#SDT 14 మూవీ అప్ డేట్

సూపర్ హిట్ "చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే " మూవీస్ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సాయి తేజ్ హీరోగా "ప్రస్థానం "మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో #SDT 14 మూవీ రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు . మణిశర్మ సంగీతం అందిస్తున్నారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దేవ కట్టా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా సాయి తేజ్

ప్రస్తుతం సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే రిలేషన్ షిప్ లో లేను..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌ లిస్ట్ తగ్గిపోతుంది. ఈలిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రానా, నితిన్ ఇద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతన్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మెగా కుటుంబంలో ముందు వరసలో ఉన్న చరణ్, బన్నీ పెళ్లి చేసుకున్నారు. వరుణ్, శిరీష్ ల పెళ్ళిళ్లకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు ముందు వరుసలో కనపడుతుంది సాయి తేజ్ ఒక్కడే. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒకటే గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం కూడా ఇక కష్టమేనని ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్లో పనులకంటే యాక్షన్ సీక్వెన్సే ఈజీ..!

లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ టైం లో తాను కూడా ఓ కొత్త విషయం తెలుసుకున్నా అంటున్నాడు సాయి తేజ్. నేను షూటింగ్స్ తో బిజీగా ఉంటా కాబట్టి రోజూ తాను ఇంట్లో ఏం చేస్తుందో చూసే ఛాన్స్ ఉండేది కాదు.. ఇప్పుడు లాక్ డౌన్ లో ఇంట్లో ఉండటం వల్ల రియలైజ్ అయ్యాను మన తల్లులకు మనం గ్రాంటెడ్ గా ఉండాల్సిందే.. నేను తమ్ముడు వైష్ణవ్ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టడమే పెద్ద పనిగా ఫీల్ అవుతాం.. కానీ తను మాత్రం ఇన్ని రోజుల నుండి ఎన్నో పనులు చేస్తుంది. ఇన్ని పనులు చేస్తూ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో సాయి ధరమ్ తేజ్

"చిత్ర లహరి ", ప్రతి రోజూ పండగే " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో కొనసాగుతున్న హీరో సాయితేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ప్రస్థానం " మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీ కి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోష‌ల్ మీడియాలో సాయితేజ్ హ‌వా

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా సోషల్ మీడియాదే హ‌వా. అందుకే నిన్నటి తరం అగ్ర కథానాయకుల నుంచి నేటి తరం యువ కథానాయకుల వరకు అంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. తమ తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు.. వ్యక్తిగత, సామాజిక అంశాలతో కూడా తమ అభిమానులను అలరిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే.. రెండు వేర్వేరు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫాలోవ‌ర్స్ పరంగా రెండు ల్యాండ్ మార్క్స్‌ను అందుకున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ డ్రామా గా "#SDT 14"

సక్సెస్ ఫుల్ "చిత్ర లహరి", ప్రతి రోజూ పండగే" మూవీస్ తరువాత సాయి ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్" మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత హీరో సాయి తేజ్, "ప్రస్థానం" మూవీ ఫేమ్ దేవా కట్టా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నివేత పేతురాజ్ కథానాయిక.

Team TFNవాట్సాప్
సాంగ్

ఇక రీమిక్స్ చేయను..!

ఇకపై రీమిక్స్ లు జోలికి వెళ్లనంటున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. పాపం అంతలా ఎం జరిగింది.. ఈ నిర్ణయం తీసుకోడానికి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... మెగా స్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి తేజ్... మొదటి నుండి కాస్త తన మేన మామలు చిరంజీవిని, పవన్ ను అనుకరిస్తూనే ఉండేవాడు.. అంతే కాదు తన సినిమాల్లో మామ చిరు పాట ఒక్కటైనా రీమిక్స్ ఉండేలా చూసేవాడు. దీనితో సాయితేజ్ అలా చేయడం వల్ల విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా సాయితేజ్ దీనిపై స్పందించి...ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ సాంగులు ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు వత్తిడి చేసినా, తాను మాత్రం రీమిక్స్ లు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప‌క్కా మాస్ లుక్ లో సాయితేజ్?

`చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన `సుప్రీమ్` హీరో సాయితేజ్... ప్ర‌స్తుతం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` అనే హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు తెర‌కెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... వ‌చ్చే ఏడాది మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ తో నటించాలని ఉంది - సాయి ధరమ్ తేజ్

ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన "ప్రతి రోజూ పండగే " మూవీ పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. చిత్ర విజయం పట్ల సాయి ఆనందం వ్యక్తం చేశారు. మల్టీ స్టారర్ మూవీస్ పై తన స్పందన తెలియజేశారు.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej To Play An Interesting Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej New Movie News,Sai Dharam Tej Next Film Upddates,Sai Dharam Tej Upcoming Pr
సినిమా వార్తలు

పెళ్ళంటే ప‌డ‌ని యువ‌కుడిగా సాయితేజ్‌?

`చిత్ర‌ల‌హ‌రి` నుంచి కొత్త త‌ర‌హా క‌థాంశాల‌కు, పాత్ర‌ల‌కు పెద్ద పీట వేస్తున్నాడు సాయితేజ్. విడుద‌ల‌కు సిద్ధ‌మైన `ప్ర‌తి రోజూ పండ‌గే`... ఈ త‌ర‌హా చిత్ర‌మే. అంతేకాదు... `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` కూడా సాయితేజ్ ని కొత్త‌గా ఆవిష్క‌రించే చిత్ర‌మ‌ని టాక్. కాగా... ఆ సినిమా క‌థాంశం, క‌థానాయ‌కుడి పాత్రపై టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిఫ‌రెంట్ రోల్‌లో సాయి తేజ్‌?

ఈ వేస‌వికి విడుద‌లైన ‘చిత్రలహరి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేశాడు మెగా హీరో సాయి తేజ్‌. కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజుకి... ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ బాగా వ‌ర్కవుట్ అయింద‌నే చెప్పాలి. ఈ విజ‌యం అందించిన ఉత్సాహంతో తన అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం తేజు... యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి డైరెక్షన్‌లో ‘భోగి’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు... ఇదివ‌ర‌కు ఎప్పుడూ క‌నిపించ‌ని పాత్ర‌లో ఇందులో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట ఈ `సుప్రీమ్‌` స్టార్‌.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej in Gully Boy Telugu Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Sai Dharam Tej Upcoming Movies,Sai Dharam Tej New Movie News,Gully Boy in Telugu Remake,Hero Sai Dharam Tej Next in Re
సినిమా వార్తలు

గల్లీ బాయ్ రీమేక్ లో మెగా హీరో?

ఒక భాషలో సినిమా అలా హిట్టయితే చాలా మరో భాషలో రీమేక్ చేసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎనర్జిటిక్ యంగ్ అండ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇటీవల గల్లీ బాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి కలెక్షన్లు కురిపిస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్