
ట్యాగ్ · 12 కథనాలు


రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్

టైగర్ నాగేశ్వరరావు టీమ్ కు రేణూ దేశాయ్ థ్యాంక్స్

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్

'ధమాకా'.. వింటేజ్ రవితేజ ను చూస్తారు..!

'రవితేజ' బర్త్ డే కి ట్రిపుల్ ట్రీట్..!

వరుస మూవీస్ తో బిజీగా రవితేజ

రవితేజ న్యూ మూవీ అప్ డేట్

యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!

నేను నా జోన్ లో - రవితేజ

రవితేజతో మ్యాడ్ డైరెక్టర్ సూపర్ హీరో మూవీ?
రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు.ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఫినిష్ చేసేలా చూసుకుంటాడు.ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.రవితేజ కెరీర్ లో 75వ సినిమా గా వస్తుంది.

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రావణాసురు అంటూ వచ్చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్…

టైగర్ నాగేశ్వరరావు టీమ్ కు రేణూ దేశాయ్ థ్యాంక్స్
పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ రేణూ దేశాయ్. ఆతరువాత పవన్ తోనే మళ్లీ జాని అనే సినిమాలో నటించింది. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక చాలా ఏళ్లు గ్యాప్ తీసుకోని ఈమధ్యే మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మాస్ మహారాజా రవితేజ
బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ పరాజయం పాలయినా ధమాకా మూవీతో రవితేజ తన క్రేజ్, స్టామినా ను నిరూపించుకున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.

మాస్ మహారాజా రవితేజకు మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఆ మూవీలో వారిద్దరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. జనవరి 26 వ తేదీ హీరో రవితేజ తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గా స్టార్ చిరంజీవి రవితేజ కు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్
అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'ధమాకా'.. వింటేజ్ రవితేజ ను చూస్తారు..!
రీసెంట్ గానే ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఈ ఏడాదే పలు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక వాటిలో ధమాకా కూడా ఒకటి. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రీసెంట్ గానే స్పెయిన్ కు వెళ్లి అక్కడ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ప్రసన్న కుమార్ ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

'రవితేజ' బర్త్ డే కి ట్రిపుల్ ట్రీట్..!
క్రాక్ సినిమాతో మళ్లీ రవితేజ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. చాలా కాలం సరైన హిట్ కోసం ఎదురుచూసిన రవితేజకు క్రాక్ రూపంలో హిట్ దక్కింది. ఇక ప్రస్తుతం అయితే రవితేజ గతంలో కాకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది రవితేజ నుండి కనీసం రెండు సినిమాలు అయినా వచ్చే అవకాశం ఉంది. ఇక రేపు రవితేజ పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి ట్రిపుల్ ట్రీట్ రానుంది.

వరుస మూవీస్ తో బిజీగా రవితేజ
బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ జోరు పెంచారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశ లో…

రవితేజ న్యూ మూవీ అప్ డేట్
బ్లాక్ బస్టర్ "క్రాక్ " మూవీ తో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజరవితేజప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ రెండు మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!
ఇప్పటికే రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఇక ఈసినిమా చేస్తూనే శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. దివ్యాంశ కౌశిక్,రజీష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే…

నేను నా జోన్ లో - రవితేజ
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఒక సాంగ్ , ఒక యాక్షన్ సీన్ బ్యాలెన్స్ ఉన్నాయి.