
ట్యాగ్ · 14 కథనాలు


రంగమార్తాండ -బ్రహ్మానందం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

రంగమార్తాండ నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం

రంగమార్తాండ ప్రకాష్ రాజ్-బ్రహ్మీ ల టఫ్ సీన్

రంగమార్తాండ మా అమ్మోరు డబ్బింగ్ కంప్లీట్

రంగమార్తాండ డబ్బింగ్ మొదలుపెట్టిన విలక్షణ నటుడు
'రంగమార్తాండ' గురూజీ మొదలుపెట్టారు

నెగటివ్ రోల్ లో క్రేజీ యాంకర్ అనసూయ ?
‘రంగమార్తాండ’లో రంగస్థల నటిగా రంగమ్మత్త?
రమ్యకృష్ణకి కూతురిగా అనసూయ?

"రంగమార్తాండ" మూవీ లో స్టార్ కమెడియన్
రంగమార్తాండ మూవీలో కీలక పాత్రలో అనసూయ

రివ్యూ : రంగమార్తాండ
ఓవరాల్ గా ఉగాది రోజున థియేటర్లలోకి వస్తున్న కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమా అద్భుతమైన కథ, కథనం, ఎమోషనల్ సీన్స్ తో అందర్నీ ఆట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం నటన హైలైట్స్ గా నిలిచిన ఈ సినిమాని ఈ పండగకి పిల్లలు, పెద్దలు అందరూ తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లోని అమ్మ నాన్నల కథ, ఈ తరం, రేపటి తరం తెలుసుకోవాల్సిన గొప్ప కథ.

రంగమార్తాండ -బ్రహ్మానందం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృష్ణవంశీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ఈసినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసింది. ఈసినిమా డబ్బింగ్ అప్ డేట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క అప్ డేట్ ను ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఈమధ్య వరుసగా సినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను…

రంగమార్తాండ నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో ప్రతి ఒక్కరి డబ్బింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. ఈసినిమాకు ముందు నేను దర్శకత్వం వహించాలని అనుకున్నాను, అయితే కృష్ణ వంశీ దర్శకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని అనుకున్నా…

రంగమార్తాండ ప్రకాష్ రాజ్-బ్రహ్మీ ల టఫ్ సీన్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. ఎన్నో పరాజయాల తరువాత కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈసినిమా మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈసినిమాకు షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా పడింది. అలా ఎన్నో అవాంతరాలు అందుకొని ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతంఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఒకరి తరువాత ఒకరు డబ్బింగ్ ను పూర్తిచేసుకుంటున్నారు. కృష్ణవంశీ కూడా అందుకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి డబ్బింగ్ కు…

రంగమార్తాండ మా అమ్మోరు డబ్బింగ్ కంప్లీట్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

రంగమార్తాండ మూవీ కి డబ్బింగ్ చెబుతున్న బ్రహ్మానందం
హౌస్ ఫుల్ మూవీస్ , రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ మరాఠి మూవీ నటసామ్రాట్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన రంగమార్తాండ మూవీ నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ రిలీజ్ కానుందని సమాచారం. ఈ మూవీ లో ఆదర్శ్ బాలకృష్ణ , అనసూయ , శివాత్మిక రాజ శేఖర్ , రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయ రాజా సంగీతం అందించారు.

రంగమార్తాండ డబ్బింగ్ మొదలుపెట్టిన విలక్షణ నటుడు
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా సూపర్ హిట్ అయిన ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటివరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది.
'రంగమార్తాండ' గురూజీ మొదలుపెట్టారు
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.

నెగటివ్ రోల్ లో క్రేజీ యాంకర్ అనసూయ ?
బుల్లితెర పై తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "రంగస్థలం " మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ , సైమా , జీ సినీ అవార్డ్స్ అందుకున్నారు. "వకీల్ సాబ్" , "పుష్ప ", "ఆచార్య" మూవీస్ లో అనసూయ నటిస్తున్నారు.
‘రంగమార్తాండ’లో రంగస్థల నటిగా రంగమ్మత్త?
ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాతగా రాణిస్తూనే.. మరోవైపు వెండితెరపై వెలుగులు పంచుతోంది టాలెంటెడ్ బ్యూటీ అనసూయ. `రంగస్థలం`లోని “రంగమ్మ” పాత్రతో నటిగా మరోమెట్టు ఎదిగిన అను.. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ`లో కీలక పాత్రలో నటిస్తోంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం రంగస్థల నటిగా ఆమె పాత్ర ఉంటుందని తెలిసింది.

"రంగమార్తాండ " మూవీ లో నటుడు గా రాహుల్ సిప్లిగంజ్
సూపర్ హిట్ మూవీస్ ఈగ, రచ్చ, రంగస్థలం, కాంచన 3, RX 100, ఇస్మార్ట్ శంకర్ వంటి మూవీస్ లో తన సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు నటుడిగా అలరించనున్నారు. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3 టైటిల్ గెలుచుకొన్న రాహుల్ సింగర్ గానూ, నటుడి గానూ పలు అవకాశాలను అందుకొంటున్నారు. ఇప్పుడు రాహుల్ "రంగమార్తాండ " మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నట్టు సమాచారం.
రమ్యకృష్ణకి కూతురిగా అనసూయ?
నటన నుంచి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ విషాదకర జీవితంతో తెరకెక్కుతున్న చిత్రం `రంగమార్తాండ`. మరాఠీ బ్లాక్ బస్టర్ `నట సామ్రాట్`కి రీమేక్ గా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ లో నటిస్తుండగా... ఆయనకి జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. బ్రహ్మానందం ఓ ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు అందిస్తున్నాడు.

"రంగమార్తాండ" మూవీ లో స్టార్ కమెడియన్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న "రంగమార్తాండ" మూవీ షూటింగ్ నిన్న వైజాగ్ లో ప్రారంభమయింది. మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న" రంగమార్తాండ" మూవీ ప్రారంభోత్సవం లో డైరెక్టర్ తేజ పాల్గొని ఫస్ట్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్ర కు ఎంపిక అయ్యారు. అభిషేక్, మధు నిర్మాణసారథ్యంలోరూపొందుతున్న"రంగమార్తాండ" మూవీ కి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
రంగమార్తాండ మూవీలో కీలక పాత్రలో అనసూయ
సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో రంగమార్తాండ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రంగమార్తాండ మూవీ రూపొందుతుంది 1998 సంవత్సరంలో చంద్రలేఖ మలయాళ మూవీ ని చంద్రలేఖ పేరు తో తెలుగులో రీమేక్ చేసిన కృష్ణ వంశీ తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత మరో రీమేక్ మూవీ కి దర్శకత్వం వహించడం విశేషం.