
ట్యాగ్ · 14 కథనాలు


పుష్ప 2 టీజర్ రిలీజ్- బన్నీ మాస్ జాతర

పుష్ప 2 టీజర్ కోసం ఎదురుచూస్తున్న వార్నర్

పుష్ప2 టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

బన్నీ బర్త్ డే కి పుష్ప 2 టీజర్ ఫిక్స్

పుష్ప2 వీడియోకు 100 మిలియన్ల వ్యూస్

పుష్ప రూలింగ్ మొదలు- రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్

పుష్ప2 ఫస్ట్ లుక్ రికార్డ్

పుష్ప2-పూనకాలు తెప్పిస్తున్న బన్నీ లుక్

పుష్ప 2 ది రూల్ వీడియో రిలీజ్ : ఇది పుష్ప గాడి రూల్

పుష్ప :ది రూల్ కాన్సెప్ట్ వీడియో టీజర్ రిలీజ్

పుష్ప2 టీజర్- సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న టీజర్
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప-2 ది రూల్. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప ఫస్ట పార్ట్ సంచలన విజయం సాధించడమే. ఫస్ట్ పార్ట్ తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈసినిమాలో ఐకాన్‌స్టార్ నటనకు, డైరెక్టర్ సుకుమార్ మేకింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

పుష్ప 2 టీజర్ రిలీజ్- బన్నీ మాస్ జాతర
మొత్తానికి ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది పుష్ప2 టీజర్ కోసం. నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అప్పటినుండి టీజర్ ఎప్పుడువస్తుందా అని చూస్తున్నారు. ఫైనల్ గా టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక టీజర్ లో బన్నీ మరోసారి మాస్ జాతర చూపించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చీర కట్టుకొని ఒంటి నిండా నగలుతో ఉన్న బన్నీ లుక్కే కిక్ ఇస్తుంది. దానికితోడు యాక్షన్ సీక్వెన్స్, బన్నీ యాటిట్యూట్, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్…

పుష్ప 2 టీజర్ కోసం ఎదురుచూస్తున్న వార్నర్
పుష్ప 2 టీజర్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెటర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అందులో ఇండియన్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా ,ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వున్నారు.పుష్ప రిలీజైన టైంలో డేవిడ్ వార్నర్ ఆసినిమాకు ఫ్యాన్ అయిపోయాడు. మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో శ్రీవల్లి స్టెప్ ను అలాగే తగ్గేదేలేదు అంటూ అల్లు అర్జున్ డైలాగ్ ను పలు సార్లు రీ క్రీయేట్ చేశాడు.

పుష్ప 2.. టీజర్ వస్తోంది, ఇయర్‌ఫోన్స్ రెడీ చేసుకోండి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం 'పుష్ప 2: ది రూల్'. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా 'పుష్ప 2' టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో బన్నీ అభిమానులు ఇప్పుడు ఈ అప్‌డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.

పుష్ప2 టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. పుష్ప సినిమాతో పెరిగిన క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ గా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలన విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. అంతేకాదు నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. సోషల్ మీడియాలో ఫాలోవర్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక రీసెంట్ గా దుబాయ్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో వాక్స్ స్టాచ్యూ కూడా పెట్టారు. ఇలా పుష్పతో బన్నీ రేంజ్ మారిపోయింది.

బన్నీ బర్త్ డే కి పుష్ప 2 టీజర్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పుష్ప2 వీడియోకు 100 మిలియన్ల వ్యూస్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప2. ఈసినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పార్ట్ 2 పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకే సుకుమార్ కాస్త టైమ్ తీసుకొని పార్ట్ 2కోసం సాలిడ్ కథను రాసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆవీడియోకు ఏ రేంజ్…

పుష్ప రూలింగ్ మొదలు- రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్
అలా వచ్చాడో లేదో ఇలా అప్పుడే రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 షూట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పార్ట్ 1 దేశవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. దాంతో పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ మంచి ట్రీట్ ఇచ్చిన సంగతి విదితమే. వేర్ ఈజ్ పుష్ప అనే టైటిల్ తో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

రికార్డు సృష్టించిన పుష్ప 2 ఫస్ట్ లుక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చిత్తూరులో జరిగే గంగమ్మ జాతరలో అమ్మవారిని పోలిన లుక్ లో వున్న అల్లు అర్జున్ పోస్టర్ ను నిన్న విడుదలచేయగా మాములు రెస్పాన్స్ రావడంలేదు.అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలైన ఈ పోస్టర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈపోస్టర్ ను బన్నీ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేయగా..ఇంస్టాగ్రామ్ లో 5M లైక్స్, ట్విట్టర్ లో 207k లైక్స్ అలాగే ఫేస్ బుక్ లో 850k లైక్స్ తో అత్యధిక లైక్స్ పొందిన ఫస్ట్ లుక్ గా రికార్డు సృష్టించింది.

పుష్ప2 ఫస్ట్ లుక్ రికార్డ్
పుష్ప 2 అంటూ అలా వచ్చాడో లేదో అప్పుడే రికార్డులు మొదలుపెట్టేశాడు బన్నీ. పుష్ప సినిమా మొదలైనప్పుడు అప్పట్లో కూడా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు బన్నీ. ఇక రిలీజ్ అయిన తరువాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అప్ డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. నిన్ననే ఈసినిమా నుండి వేర్ ఈజ్ పుష్ప అంటూ ఒక వీడియోను అలానే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

పుష్ప2-పూనకాలు తెప్పిస్తున్న బన్నీ లుక్
దేశ వ్యాప్తంగా అందరూ వెయిట్ చూస్తున్న సినిమాల్లో పుష్ప2 సినిమా ఒకటి. మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో రెండో పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరోవైపు ఫ్యాన్స్ అప్ డేట్ కోసం ఎప్పటినుండో చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఓ వీడియో ను రిలీజ్ చేశారు. వేర్ ఈజ్ పుష్ప అనే క్యాప్షన్ తో రిలీజ్ అయిన ఈవీడియో ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

పుష్ప 2 ది రూల్ వీడియో రిలీజ్ : ఇది పుష్ప గాడి రూల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ .. పుష్ప ది రూల్ నుండి వీడియో రిలీజ్ అయ్యింది. పుష్ప 2 ది రూల్ పేరుతో 3నిమిషాల 15సెకండ్ల రన్ టైం తో ఈవీడియోను కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో పుష్ప ది రూల్ ఎలా వుండబోతుందో చూపించారు. జైలు నుండి తప్పించుకున్న పుష్ప ఎక్కడున్నాడు సమాధానంగా ఈవీడియోను రిలీజ్ చేశారు. జైలు నుండి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకొని శేషాచలం అడవుల్లోకి పారిపోవడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ను మొదలు పెడతారు. అందులో భాగంగా ఓ కొండపై పుష్ప ధరించిన షర్ట్ దొరుకుంది దానికి ఏకంగా 8బుల్లెట్ రంద్రాలు ఉండడంతో పుష్ప చనిపోయి ఉంటాడని వదంతులు వ్యాపిస్తాయి…

పుష్ప :ది రూల్ కాన్సెప్ట్ వీడియో టీజర్ రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప :ది రూల్ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈనెల 7న సాయంత్రం 4:05 గంటలకు ఈకాన్సెప్ట్ వీడియో ను విడుదలకానుందని కొద్దీ సేపటి క్రితం ఒక చిన్నటీజర్ ద్వారా మేకర్స్ తెలిజేశారు. ఇక ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో పారిపోయిన పుష్ప ఎక్కడ వున్నాడు అంటూ టీజర్ సార్ట్ అయ్యింది. అసలు పుష్పను ఎందుకు అరెస్ట్ చేసారు? జైలు నుండి తప్పించుకొని ఎటువెళ్ళాడు? పెళ్లి తరువాత ఏం జరిగింది అనే విషయాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి చాలా రోజుల నుండి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానున్న పుష్ప 2 టీజర్
బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా లో కూడా అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ సంఖ్యా అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.