
ట్యాగ్ · 233 కథనాలు · పేజీ 12


"ఏక్ మినీ కథ "మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్

గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ సెట్ లో "ఆదిపురుష్ "షూటింగ్

'ఆదిపురుష్' టీమ్ షిఫ్ట్ టు హైద్రాబాద్

ప్రభాస్ పై శ్రుతి హాసన్ ప్రశంసలు

హీరో ప్రభాస్ , నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ
ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
ప్రభాస్ సినిమా అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
కోల్ మైన్స్ లో "సలార్ "యాక్షన్ సీన్స్

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ కన్ఫామ్
కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ ?

సలార్ లో 'బేర్ బాడీ'తో ప్రభాస్..!
బాలీవుడ్ లో హీరోస్ బేర్ బాడీ తో కనిపించడం కామన్.. కానీ ఇక్కడ మన టాలీవుడ్ లో మాత్రం హీరోస్ చాలామంది షర్ట్ లెస్ గా కనిపించాలంటే కాస్త ఆలోచిస్తారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలకే కాస్త టైమ్ పట్టింది. అయితే ఇప్పుడిప్పుడే మన హీరోలు కూడా షర్ట్ లెస్ గా స్క్రీన్ పై కనిపించడానికి తమ బాడీని చూపించడానికి ముందుకొస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి ప్రభాస్ ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అసలు సంగతేంటంటే..

"ఏక్ మినీ కథ "మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్
యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై కార్తీక్ రాపోలు దర్శకత్వంలో దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ , కావ్య థాపర్ జంటగా రూపొందిన "ఏక్ మినీ కథ "మూవీ మే 27 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నూతన దర్శకుడు కార్తీక్ ఒక వినూత్న కాన్సెప్ట్ తో ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా "ఏక్ మినీ కథ "మూవీ ని తెరకెక్కించారు.

గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ సెట్ లో "ఆదిపురుష్ "షూటింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "సలార్ ", "ఆదిపురుష్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా కారణంగా ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మూవీస్ అన్నీ హైదరాబాద్ సెట్స్ లోనే చిత్రీకరణ జరపాలని దర్శక , నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

'ఆదిపురుష్' టీమ్ షిఫ్ట్ టు హైద్రాబాద్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు కూడా మొన్నటివరకూ స్పీడుగానే జరుగుతుంది . అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. సినిమా కోసం ముంబైకే మకాం మార్చిన ప్రభాస్ కూడా ఇక్కడికే వచ్చేశాడు.

నాగ్ అశ్విన్ -ప్రభాస్ సినిమాలో అక్టోబర్ నుండి దీపికా
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఇక నాగ్ అశ్విన్ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ప్రభాస్ పై శ్రుతి హాసన్ ప్రశంసలు
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో , తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శృతి కథానాయిక గా రూపొందిన "క్రాక్ ", "వకీల్ సాబ్ "మూవీస్ ఘనవిజయం సాధించాయి. సోషల్ మీడియా లో శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే . తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన "లాభం"తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

హీరో ప్రభాస్ , నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ “సలార్ ” మూవీస్ చిత్రీకరణ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ
బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీతో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. ప్రభాస్ హీరోగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం "ఆదిపురుష్ ", "సలార్ " మూవీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
సినిమా లవర్స్ మాత్రం ఆ ఏడాది పండగే పండగ. గ్యాప్ లేకుండా ప్రతివారం కనీసం ఓ నాలుగైదు సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అవి కూడా ఏదో చిన్నా చితకా సినిమాలు.. లైట్ తీసుకునే సినిమాలు కూడా లేవు. అన్నీ మంచి భారీ అంచనాలతో వస్తున్న సినిమాలే. కొన్ని సినిమాలు మాత్రం గత ఏదాది రిలీజ్ కాకుండా పెండింగ్ లో ఉన్నవి.. ఇంకొన్ని సినిమాలు ఆ ఏడాది రిలీజ్ కు సిద్దంగా ఉన్నవి.. వెరసి గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ కాగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. చిరు 'ఆచార్య', పవన్ 'వకీల్ సాబ్', ప్రభాస్…
ప్రభాస్ సినిమా అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
‘జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ ప్రభాస్ సినిమా అప్ డేట్ కచ్చితంగా ఇస్తానని నాగ్ అశ్విన్ ప్రభ్స్ ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రామిస్ చేసినట్టే ఎక్కువ టైమ్ తీసుకోకుండా అప్ డేట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకు పనిచేయబోయే సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. అలాగే మిక్కీ జే మేయర్ ను ఈ సినిమాకు సంగీతం దర్శకునిగా ఎంపికచేశారు.
కోల్ మైన్స్ లో "సలార్ "యాక్షన్ సీన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ "ఆదిపురుష్ ", ప్రశాంత్ నీల్ "సలార్ "మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ కన్ఫామ్
గతకొద్ది రోజులుగా నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. వైజయంతి మూవీస్ చెప్పినట్లే భారీ అనౌన్స్మెంట్ తో ముందుకు వచ్చేసింది. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ ?
లండన్ నుండి నుండి హైదరాబాద్ చేరుకొన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీస్ ఫైనలైజ్ పనిలో స్క్రిప్ట్స్ వింటూ బిజీగా ఉన్నారు. దేశ వ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీస్ కై మొగ్గు చూపుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం UV క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా 'జాన్' మూవీ లో నటిస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ మూవీ 2020 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ కానుంది.