నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఇక నాగ్ అశ్విన్ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా ప్రారంభమైనా కూడా దీపికా కాస్త లేట్ గానే షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ నుండి దీపికా సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం. మరి ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ ఎలాగూ లేట్ అవ్వనుంది కాబట్టి ఈలోపు ప్రభాస్ పోర్షన్స్ ముందు షూటింగ్ చేసినా తరువాత దీపికా జాయిన్ అయినా సరిపోతుంది.
కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























