సలార్ లో ‘బేర్ బాడీ’తో ప్రభాస్..!

Rebel Star Prabhas Once Again To Go Shirtless For An Action Sequence Scene in Salaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas New Movie Updates,Prabhas Movie Updates,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Details,Prabhas To Play Dual Role For Salaar,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Updates,Salaar Film Updates,Salaar Movie News,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Prabhas Salaar Action Sequence Scene,Salaar Action Sequence Scene,Rebel Star Prabhas To Go Shirtless,Shirtless Prabhas To Flaunt His Six Pack Abs In Salaar,Prabhas To Flaunt His Six Pack Abs In Salaar,Prabhas To Flaunt Off His Abs For Salaar,Prabhas Six Pack Abs In Salaar,Prabhas Shirtless in Salaar Movie,Prabhas Six Pack Abs Salaar

బాలీవుడ్ లో హీరోస్ బేర్ బాడీ తో కనిపించడం కామన్.. కానీ ఇక్కడ మన టాలీవుడ్ లో మాత్రం హీరోస్ చాలామంది షర్ట్ లెస్ గా కనిపించాలంటే కాస్త ఆలోచిస్తారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలకే కాస్త టైమ్ పట్టింది. అయితే ఇప్పుడిప్పుడే మన హీరోలు కూడా షర్ట్ లెస్ గా స్క్రీన్ పై కనిపించడానికి తమ బాడీని చూపించడానికి ముందుకొస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి ప్రభాస్ ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అసలు సంగతేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్ హీరోగా కె.జి.యఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బొగ్గు నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ఈసినిమాను కూడా తొందరగానే పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్-ప్రశాంత్ నీల్. అయితే ఈసినిమాలో మరోసారి ప్రభాస్ బేర్ బాడీతో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఒక యాక్షన్ సీన్ లో ప్రభాస్ తన సిక్స్ పాక్ బాడీతో, యాబ్స్ తో కనిపిస్తాడని.. ఈ యాక్షన్ పార్ట్ అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరికీ గూజ్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. మరి ప్రభాస్ లాంటి ఫిజిక్ ఉన్న హీరో షర్ట్ లెస్ తో కనిపిస్తే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం.

ఇక ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్‌ కు విలన్‌గా చేస్తున్నాడు.

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ తో ఒక సినిమా, తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు. ఒక్క నాగ్ అశ్విన్ నే ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seventeen =