
ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2


నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్

'పెద్దన్న' టీజర్ రిలీజ్

'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ రిలీజ్

అట్లీ-షారుఖ్ సినిమాలో రానా..!

ఫైనల్లీ షారుఖ్-అట్లీ సినిమా షురూ

ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ కన్ఫామ్ చేసిన 'నయన్'

'షారుఖ్' కోసం స్పెషల్ టీజర్..!

వారితో నటించడం సరదాగా ఉంటుంది - సమంత

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?

"అన్నాత్తే "మూవీ సెట్స్ లో నయనతార

నయన్ మరో హారర్ సినిమా 'కనెక్ట్'
లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఇక నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్రికన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలానే రజినీకాంత్ సినిమా అన్నాత్తే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్. రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల కాదల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నయనతార నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రను నయనతార చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలయితే వస్తున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా తను ఈసినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ…

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్నాత్తే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమేషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే రజినీ అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసింది.

'పెద్దన్న' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా అన్నాత్తే. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తెలుగులో ఈసినిమాను పెద్దన్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు…

రజనీకాంత్ "పెద్దన్న "మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పెద్దన్న"మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలకపాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ ఇటీవలే సిటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సీటీమార్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్నాడు. సీటీమార్ సక్సెస్ సాధించడంతో ఇక ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 8న విడుదల కానుండటంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్…

అట్లీ-షారుఖ్ సినిమాలో రానా..!
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా ప్రారంభించారు కూడా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు రానా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కీలక పాత్ర కోసం రానాను ఎంపిక చేశారట మేకర్స్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా ఈసిమాలో హీరోయిన్స్ గా నయనతార, ప్రియమణి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను షారుఖ్ తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై స్వయంగా…

ఫైనల్లీ షారుఖ్-అట్లీ సినిమా షురూ
ఒకప్పుడు బాలీవుడ్ బాద్ షా లాగ బాలీవుడ్ ను ఏలిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు కాస్త వెనుకబడ్డాడు. వరుస ఫ్లాపులు రావడంతో ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి సౌత్ డైరెక్టర్ ను నమ్ముకున్నాడు. అట్లీ ర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుందనే టాక్ గత రెండేళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేశారు మేకర్స్. ఫైనల్లీ ఎప్పటినుండో అనుకుంటున్న షారుఖ్-అట్లీ ఇన్ని రోజులకు పట్టాలెక్కింది.

ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ కన్ఫామ్ చేసిన 'నయన్'
మొత్తానికి ఇన్ని రోజులకు స్టార్ హీరోయిన్ కమ్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. నయన తార, విఘ్నేష్ శివన్ ల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే కదా. బహిరంగంగా ఎప్పుడూ స్టేట్ మెంట్స్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో ఇద్దరూ షేర్ చేసే ఫొటోలు.. పోస్ట్ లను బట్టి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఈమధ్య పెళ్లిపై కూడా పలు వార్తలు వచ్చాయి. కొంతమంది పెళ్లి అయిపోయిందంటే మరికొంతమంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు రాసేశారు. ఇక ఫైనల్ గా ఇన్ని రోజులకు నయన తార ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

'షారుఖ్' కోసం స్పెషల్ టీజర్..!
తమిళ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో అట్లీ కూడా ఒకడు. 'రాజా రాణి' లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీతో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ. ముఖ్యంగా దళపతి విజయ్ తో ఏకంగా తేరీ, మెర్సల్, బిగిల్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక విజయ్ తో వరుసగా హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అట్లీ అరంగేట్రం చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇంతవరకూ ఈసినిమా మాత్రం సెట్స్ పైకి…

వారితో నటించడం సరదాగా ఉంటుంది - సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ ద్వారా సమంత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టారు. ఆవెబ్ సిరీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో శకుంతల గా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె అజయ్ కుమార్ దర్శకత్వంలో మాధవి ప్రధాన పాత్రలో రూపొందిన "మాతృదేవోభవ"మూవీ 1991 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ బెస్ట్ మూవీ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. కీరవాణి స్వరకల్పనలో వేటూరి రచన , కీరవాణి గానం చేసిన "రాలిపోయే పువ్వా " సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొందింది . బెస్ట్ లిరిసిస్ట్ గా వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

"అన్నాత్తే "మూవీ సెట్స్ లో నయనతార
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "అన్నాత్తే "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార , జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ కథానాయికలు కాగా సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.