
ట్యాగ్ · 15 కథనాలు


గ్రాండ్ గా ప్రారంభం కానున్న #NANI 30

నాని కొత్త సినిమా అనౌన్స్ మెంట్

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!

దసరాకు నాని కొత్త సినిమా ప్రకటన
తెలంగాణ యాసలో నాని..!

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని మూవీ
హీరో నాని రక్తదానం

కొత్త సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్
నాని 'V' షూటింగ్ పూర్తి
చాలా గర్వంగా ఉంది - హీరో నాని

నాని కోసం రెండు ఆసక్తికరమైన కథలు

వారసుల పేర్లతో... తండ్రుల స్క్రీన్ నేమ్స్...

దసరా పై మీ ప్రేమకు థ్యంక్స్
కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటి వరకూ పక్కింటి కుర్రాడి లాంటి పాత్రల్లో అలానే లవర్ బాయ్ పాత్రల్లో ఇక ఓ మాదిరి మాస్ పాత్రల్లో నచించి మెప్పించిన నాని ఈసినిమాతో తన కూడా ఊర మాస్ యాంగిల్ ఉందని నిరూపించడానికి దసరా సనిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మొదటి సారి ఈ రేంజ్ మాస్…

గ్రాండ్ గా ప్రారంభం కానున్న #NANI 30
విభిన్న కథా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దసరా మూవీ రెండు పార్ట్స్ రూమర్స్ పై హీరో నాని క్లారిటీ
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

నాని కొత్త సినిమా అనౌన్స్ మెంట్
అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన మార్క్ ను చూపించి ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకగుర్తింపును తెచ్చుకున్నాడు నాని. ఏ ఎమోషన్ అయినా న్యాచురల్ గా చూపించే టాలెంట్ ఉంది కాబట్టి న్యాచురల్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. నాని నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.అంతేకాదు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. నటుడిగానే కాదు మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు నర్మిస్తున్నాడు. ప్రస్తుతం అయితే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని దసరా అనే సినిమా చేస్తున్నాడు. సింగరేణి గోదావరిఖని గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు.

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు నాని. ప్రస్తుతం నాని తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

దసరాకు నాని కొత్త సినిమా ప్రకటన
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా నేపథ్యం లో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ "శ్యామ్ సింగ రాయ్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి, కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అంటే .. సుందరానికీ! మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నజ్రియా నజీమ్ కథానాయిక. హీరో నాని ఒక కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణ యాసలో నాని..!
వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీ అవ్వనున్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక్కసారి లాక్ డౌన్ కనుక తీసేస్తే షూటింగ్ లతో బిజీ కానున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేసాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాక్ డౌన్ వల్ల ఆగింది. ఆ సినిమా చేస్తూనే నానితో ‘నిన్ను కోరి ' తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఆతర్వాత 'టాక్సీవాలా' సినిమా…

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని మూవీ
హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్, "బ్రోచేవారెవరురా " మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించే చిత్రాలలో నాని నటించనున్నారు. నాని ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హీరో నాని రక్తదానం
తలసేమియా పేషేంట్స్ కు బ్లడ్ అవసరం చాలా ఎక్కువ అనే విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ స్టాక్ తక్కువగా ఉంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో బ్లడ్ డొనేట్ చేయడానికి డోనర్స్ జంకుతున్నారు. ఈ సమయంలో హీరో నానితన భార్యతో సహా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడే వారికి ప్రేరణ గా నిలిచిన హీరో నానికి సెల్యూట్ అంటూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ట్వీట్ చేసింది.

కొత్త సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్
హీరో నాని పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తరువాత "టాక్సీ వాలా " ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా "శ్యామ్ సింగరాయ్" మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
నాని 'V' షూటింగ్ పూర్తి
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. గతకొద్ది రోజుల ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నిన్నటి తో పూర్తి చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయిందని నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
చాలా గర్వంగా ఉంది - హీరో నాని
కథానాయకుడిగా వరుస సినిమాలలో నటిస్తూనే తన అభిరుచికి తగిన సినిమాలు నిర్మించాలని హీరో నాని ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. మొదటి ప్రయత్నం గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ ప్రధాన పాత్రలలో సైకలాజికల్థ్రిల్లర్ "అ !" మూవీ ని నాని నిర్మించారు. "అ !" మూవీ విజయం సాధించింది. "అ !" మూవీ కి రంజిత్ మేకప్ మెన్ గా పనిచేశారు.

నాని కోసం రెండు ఆసక్తికరమైన కథలు
ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం యువ కథానాయకుడు నాని శైలి. ప్రస్తుతం ఒకవైపు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో నటిస్తూనే… మరోవైపు తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ చిత్రం చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. అంతేకాదు.. విలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం నాని కాల్షీట్స్ కోసం రెండు ఆసక్తికరమైన కథలు ఎదురు చూస్తున్నాయని టాక్.

‘వి’ కోసం స్నేహ ధర్మం పాటించనున్న నాని?
ఇటీవల విడుదలైన ‘జెర్సీ’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఇంటలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో నటించనున్నాడు ఈ నేచురల్ స్టార్. ఈ సినిమా నాని కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో… నాని పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసాడంట దర్శకుడు ఇంద్రగంటి.

వారసుల పేర్లతో... తండ్రుల స్క్రీన్ నేమ్స్...
“ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాక నన్ను జడ్జ్ చేయంది నా కొడుకు ఒక్కడే… వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను”… ఇది ‘జెర్సీ’ సినిమాలో డైలాగ్. అవడానికి సినిమా డైలాగే అయినా నూటికి నూరు పాళ్ళు ప్రతీ తండ్రి మనసులో ఉండే మాటే ఇది. అందుకే ప్రతీ తండ్రి తను సాధించిన ప్రతీ విజయంలోనూ కొడుకుని కూడా భాగస్వామిని చేస్తాడు. ఈ విషయంలో సినీ తారలు ఏమాత్రం మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో వారి స్టార్‌డమ్‌ను తమ తనయులకు పరోక్షంగా ఆపాదించడానికి ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. అదెలాగంటే… తమ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్‌గా చేసుకుని కొంతమంది ప్రముఖ కథానాయకులు తెరపై సందడి చేశారు.