కథానాయకుడిగా వరుస సినిమాలలో నటిస్తూనే తన అభిరుచికి తగిన సినిమాలు నిర్మించాలని హీరో నాని ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. మొదటి ప్రయత్నం గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ ప్రధాన పాత్రలలో సైకలాజికల్థ్రిల్లర్ “అ !” మూవీ ని నాని నిర్మించారు. “అ !” మూవీ విజయం సాధించింది. “అ !” మూవీ కి రంజిత్ మేకప్ మెన్ గా పనిచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో డిసెంబర్ 23వ తేదీ 66వ జాతీయ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ అవార్డ్స్ ను విజేతలకు అందజేశారు. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ (మహానటి ), ఉత్తమ స్క్రీన్ ప్లే రాహుల్ రవీంద్రన్ (చి || ల || సౌ ), ఉత్తమ మేకప్ మెన్ రంజిత్ (“అ !”) అవార్డ్స్ అందుకొన్నారు. తెలుగు సినీ చరిత్ర లో మేకప్ విభాగం లో అవార్డ్ అందుకున్న మొదటి వ్యక్తి రంజిత్ అని, మా ప్రొడక్షన్ లో రూపొందిన మొదటి మూవీ “అ !” తో అవార్డ్ అందుకున్న రంజిత్ ను చూస్తే చాలా గర్వంగా ఉందని నాని ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























