ఇటీవల విడుదలైన ‘జెర్సీ’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఇంటలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో నటించనున్నాడు ఈ నేచురల్ స్టార్. ఈ సినిమా నాని కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో… నాని పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసాడంట దర్శకుడు ఇంద్రగంటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… స్నేహ ధర్మం కోసం అధర్మాన్ని ఎదిరించలేని ఓ ఎమోషన్‌లెస్, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను నాని కోసం రూపొందించాడంట ఇంద్రగంటి. ఓ విధంగా ఇది మహాభారతంలో కర్ణుడి పాత్రను తలపించే విధంగా ఉంటుందని సమాచారం. మరి ‘జెర్సీ’లో భావోద్వేగభరిత సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత కంట తడిపెట్టించిన నాని… వి
కోసం ఈ వైవిధ్యభరితమైన పాత్రలో ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.
కాగా… ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా… నివేదా థామస్, అదితిరావ్ హైదరి కథానాయికలుగా కనిపించనున్నారు. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=bjl-gISLXzQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: