
ట్యాగ్ · 15 కథనాలు


పీరియాడిక్ డ్రామా లో మెగాప్రిన్స్?

పెళ్లి పీటలెక్కబోతున్న మెగా ప్రిన్స్

మనసు చాటుకున్న మెగా ప్రిన్స్

ఇంటర్ నేషనల్ ఏజెంట్ గా వరుణ్ తేజ్ ?

వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం

డబ్బింగ్ స్టార్ట్ చేసిన 'గని'

"గని" సెట్స్ లో సయీ మంజ్రేకర్

'గని' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

మెగా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ

"గని "మూవీకి హాలీవుడ్ యాక్షన్ కంపోజర్స్

రిలాక్స్ మోడ్ లో వరుణ్ తేజ్
వర్క్ మోడ్ లో వరుణ్

మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మెగా ప్రిన్స్

మట్కా రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పీరియాడిక్ డ్రామా లో మెగాప్రిన్స్?
మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇక గత ఏడాది ఎఫ్ 3, గని సినిమాతో ప్రేక్షకులతో ముందుకు రాగా.. వాటిలో ఎఫ్ 3 సినిమా హిట్ అయింది కానీ గని సినిమా మాత్రం పరాజయాన్ని అందించింది. ప్రస్తుతం అయితే వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీనితో పాటు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

పెళ్లి పీటలెక్కబోతున్న మెగా ప్రిన్స్
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఒక్కోక్కరు పెళ్లిళ్లు చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. గత రెండేళ్లలో ఎంతోమంది యంగ్ హీరోలు వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక ఈమధ్యనే నాగశౌర్య కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటినుండో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనిపించుకుంటున్న శర్వానంద్ సైతం వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గానే ఆయన నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గత కొంత కాలంగా వరుణ్ తేజ్ పెళ్లిపై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి.

మనసు చాటుకున్న మెగా ప్రిన్స్
టాలీవుడ్ హీరోలు కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది చేసే పనులు బయటకు రావచ్చు.. కొంతమంది చేసే పనులు బయటకి కనిపించకపోవచ్చు కానీ.. చాలామంది సెలబ్రిటీలు మాత్రం చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక ఈకార్యక్రమాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తెలిసిందే కదా. అందులో మెగా దిగ్గజం చిరు చేసే సేవా కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇంటర్ నేషనల్ ఏజెంట్ గా వరుణ్ తేజ్ ?
“ముకుంద “మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన వరుణ్ తేజ్ “కంచె “, “ఫిదా”, “తొలిప్రేమ “, “F 2 “,” గద్దలకొండ గణేష్” వంటి విభిన్న కథా చిత్రాలతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వరుణ్ తేజ్“F3 “మూవీ తో విజయయం సాధించారు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “#VT 12” కై వరుణ్ తేజ్ ప్రిపేర్ అవుతున్నారు.

వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకునే వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో లాంటి మాస్ పాత్రలో అయినా.. అలానే ఎఫ్ 2 మూవీలోని కామెడీ పాత్ర అయినా చాలా ఈజ్ తో చేయగలడని నిరూపించాడు. అందుకే వరుస హిట్లతో కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ మేకోవర్ లో కనిపించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గని అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 8న ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇకఈసినిమాతో పాటు ఎఫ్ 3…

వరుణ్ బర్త్ డే.. 'ఎఫ్ 3' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎఫ్ 2. ' ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అన్న ట్యాగ్ లైన్ తో 2019లో సంక్రాంతికి వచ్చిన ఈసినిమా అందరికీ ఫన్ మాత్రమే అందించి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక దాంతో ఈసినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు అప్పుడే చెప్పేశారు చిత్రయూనిట్. అన్నట్టుగానే ఈసినిమా సీక్వెల్ ను ఎఫ్ 3 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇక అన్నీ బాగుంటే ఈసీక్వెల్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది. కానీ కరోనా వల్ల.. సినిమా పనులు ఇంకా అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేయక తప్పలేదు.

డబ్బింగ్ స్టార్ట్ చేసిన 'గని'
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వరుణ్ తేజ్ కూాాడా కాస్త డిఫెరంట్ గా సినిమాలు చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన సినిమాల్లో విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు బాక్సర్ అవతారం ఎత్తాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసిన గని టీమ్ ఇప్పుడు డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. ఇక ఈవిషయాన్ని మేకర్స్ అధికారింగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ‘గని’ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటికే డబ్బింగ్ కూడా మొదలెట్టేశాడు. ‘ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ దిస్ దివాలీ 2021’ అంటూ ట్వీట్ లో…

"గని" సెట్స్ లో సయీ మంజ్రేకర్
సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ " దబాంగ్ 3" మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'గని' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం
వరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమా షూట్ కు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న వరుణ్ ఫైనల్ రౌండ్ కు రెడీ అయ్యాడు. ఈరోజు నుండి గని ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఈవిషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియచేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

మెగా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ
సౌత్ నటీ నటులకు నార్త్ పై ఎప్పుడూ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ కాస్త ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ కు వెళ్లిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడా ఇక్కడ సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ కూడా చిన్నగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఇచ్చారు... కొంతమంది ఇస్తున్నారు.. ఇక తాజాగా మరోహీరో కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆహీరో మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

"గని "మూవీకి హాలీవుడ్ యాక్షన్ కంపోజర్స్
అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

రిలాక్స్ మోడ్ లో వరుణ్ తేజ్
సక్సెస్ ఫుల్ "ముకుంద "మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం "గని ", "F 3 " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. “గని “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
వర్క్ మోడ్ లో వరుణ్
'ముకుంద'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే మొదటి సినిమా అంత విజయం అందించలేకపోయినా రెండో సినిమా 'కంచె'తోనే జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మెగా ప్రిన్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీదే ఉన్నాడు. అలా షూటింగ్ ను మొదలు పెట్టాడో లేదో అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 24 న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. సుమారు రెండు వారాలు జరిగిన ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్, ఇంకొందరు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడి షెడ్యూల్ పూర్తవడంతో…