అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గని”మూవీ లోని బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందిన విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న “గని”మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. తన ఫిజిక్ షేప్ మారకుండా వరుణ్ తేజ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు. “గని “మూవీ కై ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణ లో భారీ బాక్సింగ్ ఎపిసోడ్ కై భారీ స్టేడియం సెట్ రూపొందింది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “సుల్తాన్ ” మూవీ కి యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ యాక్షన్ కంపోజర్ లార్నెల్ స్టోవల్ , వ్లాడ్ రియింబర్గ్ ఈ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. ఈ బాక్సింగ్ ఎపిసోడ్ “గని “మూవీ కి హైలైట్ గా నిలవనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: