టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వరుణ్ తేజ్ కూాాడా కాస్త డిఫెరంట్ గా సినిమాలు చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన సినిమాల్లో విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు బాక్సర్ అవతారం ఎత్తాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసిన గని టీమ్ ఇప్పుడు డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. ఇక ఈవిషయాన్ని మేకర్స్ అధికారింగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ‘గని’ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటికే డబ్బింగ్ కూడా మొదలెట్టేశాడు. ‘ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ దిస్ దివాలీ 2021’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mega Prince @IAmVarunTej ‘s #Ghani Dubbing Started Today! 🎙🥊
Meet Ghani in your nearest theaters this Diwali 2021.💫@nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @RenaissanceMovi @adityamusic pic.twitter.com/chASbzMTrF
— Geetha Arts (@GeethaArts) August 9, 2021
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: