
ట్యాగ్ · 15 కథనాలు


రాజా సాబ్ లో నాకు అలాంటి అవకాశం రావడం అదృష్టం

మరోసారి రిలీజ్ డేట్ మార్చుకున్న తంగలాన్

3D లో విక్రమ్ తంగలాన్?

తంగలాన్ షూటింగ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

జపనీస్ భాషలో హీరో విజయ్ మాస్టర్ మూవీ రిలీజ్

విక్రమ్ 61 ట్రైటిల్ రిలీజ్

'విజయ్ దేవరకొండ' తో నటించాలని ఉంది..!

'D43' ఫస్ట్ లుక్ రిలీజ్
మాళవిక మోహనన్ కిల్లింగ్ లుక్
సూర్యకి జోడీగా రష్మిక, మాళవికా మోహనన్?

తంగలాన్.. తెలుగు రివ్యూ
కాగా మొత్తానికి తంగలాన్ సినిమా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా వైవిధ్యం కోరుకునే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. బ్రిటిష్ కలోనియం నాటి పరిస్థితులు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, అక్కడి గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించింది. ప్రతి సన్నివేశం రా అండ్ రస్టిక్ గా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనిక, పేద వర్గాల మధ్య సహజంగా ఉండే తారతమ్యాలు, అధికార బలం సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో హృద్యంగా ఆవిష్కరించింది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది తంగలాన్.

నా కెరీర్‌లో చేసిన బెస్ట్ రోల్ ఇదే - మాళవిక మోహనన్
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ విలన్ పాత్రను పోషించగా.. ప్రముఖ కోలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ పశుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు.

రాజా సాబ్ లో నాకు అలాంటి అవకాశం రావడం అదృష్టం
పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈసినిమా రిలీజ్ కాబోతుంది. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది.

సర్దార్ 2.. కార్తి సరసన హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన 'సర్దార్' చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఇటివలే 'సర్దార్ 2' రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్ మధ్య ప్రారంభమైయింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

మరోసారి రిలీజ్ డేట్ మార్చుకున్న తంగలాన్
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

తంగలాన్- మాళవిక మోహనన్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
విభిన్నమైన కథలు, సినిమాలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన సినిమాతో వచ్చేస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. గతకొంతకాలంగా ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

3D లో విక్రమ్ తంగలాన్?
పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగాా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికావాల్సింది. అయితే ఈసినిమా షూటింగ్ సమయంలో చియాన్ విక్రమ్ గాయపడటంతో కొద్ది రోజులు షూట్ బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు.

తంగలాన్ షూటింగ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.

జపనీస్ భాషలో హీరో విజయ్ మాస్టర్ మూవీ రిలీజ్
జపనీస్ భాషలో పలు తమిళ , తెలుగు మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. జపాన్ ప్రేక్షకులు సౌత్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ తమిళ మూవీ జపనీస్ వెర్షన్ జపాన్ లో రిలీజ్ కానుంది. ఇంతకు ముందు హీరో విజయ్ జపాన్ ప్రేక్షకులను గిల్లి మూవీ తో అలరించిన విషయం తెలిసిందే.

విక్రమ్ 61 ట్రైటిల్ రిలీజ్
విభిన్నమైన కథలు ఎంచుకోవడంలో, డిఫరెంట్ పాత్రలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే విక్రమ్ సినిమా అంటే కేవలం అతని అభిమానులకు మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక ఈఏడాది కోబ్రా, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు విక్రమ్. అయితే వీటిలో కోబ్రా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా పొన్నియన్ సెల్వన్ మాత్రం తమిళ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే 450 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు విక్రమ్ తన తరువాత ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ కెరీర్…

'విజయ్ దేవరకొండ' తో నటించాలని ఉంది..!
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ముఖ్యంగా తన ఆటిట్యూట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస హిట్స్ సొంతం చేసుకొని ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు. విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంట్రెస్ట్ చూపించే స్థాయికి ఎదిగాడు.

'D43' ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగులోకూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న తమిళ హీరోల్లో ధనుష్ కూడా ఒకడు. తన సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ధనుష్ కూడా తన సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడానకిి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పుడు ఏకంగా తెలుగులోనే సినిమా చేయడానికి రెడీఅయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

అభిమానులకు స్పెషల్ ట్రీట్ "మాస్టర్ " - మాళవిక మోహనన్
XB క్రియేటర్స్ బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "మాస్టర్ " తమిళ మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. మాళవిక మోహనన్ కథానాయిక. విజయ్ సేతుపతి, అర్జున్ దాస్, ఆండ్రియా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. "మాస్టర్ " మూవీ తమిళ భాషతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మాళవిక మోహనన్ కిల్లింగ్ లుక్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ "డాన్ ", "అంధా ధున్", టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ "మహర్షి ", పలు మలయాళ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కె యు మోహనన్ తనయ మాళవిక "పట్టం పోలె "మలయాళ మూవీ తో సినీకెరీర్ ప్రారంభించారు. కన్నడ, తమిళ, మలయాళ మూవీస్ లో నటించారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన "మాస్టర్ " తమిళ మూవీ లో మాళవిక హీరోయిన్ గా నటించారు.
సూర్యకి జోడీగా రష్మిక, మాళవికా మోహనన్?
ఈ వేసవికి `ఆకాశమే నీ హద్దురా` అంటూ సందడి చేయనున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. అది విడుదలయ్యేలోపే తన లక్కీ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో నెక్స్ట్ వెంచర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు సూర్య. కాగా,`అరువా` (`కత్తి` అని అర్థం) పేరుతో రూపొందనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సూర్య కవల సోదరులుగా నటించనున్నాడని ప్రచారం సాగుతోంది.