3D లో విక్రమ్ తంగలాన్?

crazy update on vikrams thangalaan movie

పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగాా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికావాల్సింది. అయితే ఈసినిమా షూటింగ్ సమయంలో చియాన్ విక్రమ్ గాయపడటంతో కొద్ది రోజులు షూట్ బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. రేపటి నుండి ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారట. అంతేకాదు ఈసినిమాా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాను 3డీ ఫార్మట్ లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో సోషల్ డ్రామాను రంజిత్ 3డీ ఫార్మట్ లో ఎలా చూపిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

కాగా పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలను ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =