పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈసినిమా రిలీజ్ కాబోతుంది. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్మలో పాల్గొన్న హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే కథల్లో, క్యారెక్టర్స్ లో నటించాలని కోరుకుంటాను. “తంగలాన్” సినిమాతో అలాంటి అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఆరతి అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ క్యారెక్టర్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. విక్రమ్ గారితో కలిసి నటించడం గొప్ప ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. విక్రమ్ గారు లేకుంటే నేను ఈ సినిమాలో ఆరతి క్యారెక్టర్ ను ఇంత బాగా పర్ ఫార్మ్ చేసేదాన్ని కాదేమో. ఎందుకంటే తంగలాన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాణమైన ఒక టఫెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి” అని అన్నారు.
ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. ఒక బ్యాంగ్ లాంటి సినిమాతో టాలీవుడ్ కు రావాలని వెయిట్ చేస్తూ వచ్చాను. రాజా సాబ్ సినిమాతో నాకు అలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన హైదరాబాద్ లోని బెస్ట్ పుడ్ నాకు పంపారు. మా మదర్ చేసిన ఫుడ్ అంత టేస్ట్ గా ఆ ఫుడ్ ఉంది. మారుతి గారు ఫీమేల్ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేస్తారు. తంగలాన్ లో నా క్యారెక్టర్ కు రాజా సాబ్ లో నా క్యారెక్టర్ తో చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది” అని తెలిపారు హీరోయిన్ మాళవిక మోహనన్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: