తెలుగులోకూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న తమిళ హీరోల్లో ధనుష్ కూడా ఒకడు. తన సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ధనుష్ కూడా తన సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడానకిి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పుడు ఏకంగా తెలుగులోనే సినిమా చేయడానికి రెడీఅయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ధనుష్ తన 43వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను ఈ నెల నుండే ప్రారంభించారు. ఇక నేడు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాకు మారన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
Very happy in presenting you the first look of our next film #Maaran #மாறன் with @dhanushkraja 🔥#MaaranFirstLook #HappyBirthdayDhanush @karthicknaren_M @MalavikaM_ @gvprakash @Lyricist_Vivek @thondankani @smruthi_venkat @KK_actoroffl @Actor_Mahendran pic.twitter.com/qyWdFuQNju
— Sathya Jyothi Films (@SathyaJyothi_) July 28, 2021
ఇందులో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటించనుండగా.. ముక్తి అమ్మన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న స్మృతి వెంకట్ ధనుష్ కు చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా వారి అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: