నటీనటులు: చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరుతిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్
సంగీతం: జీవీ ప్రకాష్
సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్ కుమార్
ఎడిటింగ్: సెల్వ ఆర్‌కే
నిర్మాణం: స్టూడియో గ్రీన్ బ్యానర్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: పా రంజిత్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విలక్షణ పాత్రలకు పెట్టింది పేరైన కోలీవుడ్ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ లీడ్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తంగలాన్’. క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్‌గా తెరకెక్కింది. బ్రిటిష్ కలోనియంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ ట్రైబల్ లీడర్‌గా సరికొత్త గెటప్‌లో కనిపించడంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తంగలాన్ ప్రేక్షకులముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన తంగలాన్ విజయం సాధించిందా? విక్రమ్ మరోసారి తనలోని విలక్షణ నటనతో మెప్పించాడా? ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎలా ఉంది? అన్నది ఇప్పుడు చూద్దాం..
కథ:
వెప్పూర్ అనే గ్రామంలో తంగలాన్(విక్రమ్), అతని భార్య(పార్వతి తిరువోతు)తో పాటు పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. అయితే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అతను తన భూమిని కోల్పోయి బానిసలుగా మారాల్సి వస్తుంది. మరోవైపు బ్రిటిష్ దొర క్లెమెంట్.. వేప్పూర్ సమీపంలోన అడవిలో ఉన్న బంగారు గనులు తవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అక్కడ దెయ్యాలున్నాయని, అడవి మనుషులు చంపేస్తారనే భయంతో ఎవరూ ముందుకు రారు. ఆ క్రమంలో బంగారం వెతికి పెట్టమని బ్రిటిష్ దొర తంగలాన్ కి సంబంధించిన తెగ దగ్గరకు వస్తాడు. అయితే ఆ బంగారు గనులకి కాపాలా కాస్తున్న ఆరతి (మాళవిక మోహనన్) నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురు అవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకుని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు ?, అసలు తంగలాన్ ఎవరు ?చివరకు తంగలాన్ ఏ నిజం తెలుసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఇక సినిమాలో నటీనటులు అందరూ అద్భుతంగా నటించారు. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ప్రతి క్యారక్టర్ సహజసిద్దంగా ఉండి సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా విక్రమ్ నభూతో.. అన్నట్టుగా నటించాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. ఇప్పటికే ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్స్ చేసిన ఆయన ఇందులో మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేసాడు. ఈ పాత్ర కోసం ఆయన మేకోవర్ అయిన విధానం అద్భుతం. తంగలాన్ లోని పాత్ర ఆయన కెరీర్‌లో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక కథానాయికల విషయానికొస్తే, మాళవిక మోహనన్, పార్వతి తిరుతిరువోతు ఎవరికివారే పోటాపోటీగా నటించారు. గిరిజన తెగలకు చెందిన స్త్రీలుగా అత్యంత సహజంగా కనిపించారు. అలాగే సీనియర్ నటుడు పశుపతి తన నటనతో పాత్రకు జీవం పోశాడు. డిఫరెంట్ మూవీస్ చేయడంలో దిట్ట అనిపించుకున్న డైరెక్టర్ బాల సినిమాల్లో పశుపతి ఎలా కనిపిస్తాడో.. అలాగే ఈ చిత్రంలోనూ టిపికల్ క్యారక్టర్ పోషించాడు. మరోవైపు హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో భయపెట్టాడు.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్ళింది. యాక్షన్ సన్నివేశాల్లో రీ రికార్డింగ్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. ఏ కిషోర్ కుమార్ కెమెరా వర్క్ అద్భుతంగా వుంది. ఇక సెల్వ ఆర్‌కే ఎడిటింగ్ షార్ప్ అండ్ క్రిస్పీగా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదని సెట్టింగ్స్ చూస్తే తెలుస్తోంది.
కాగా మొత్తానికి తంగలాన్ సినిమా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా వైవిధ్యం కోరుకునే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. బ్రిటిష్ కలోనియం నాటి పరిస్థితులు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, అక్కడి గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించింది. ప్రతి సన్నివేశం రా అండ్ రస్టిక్ గా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనిక, పేద వర్గాల మధ్య సహజంగా ఉండే తారతమ్యాలు, అధికార బలం సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో హృద్యంగా ఆవిష్కరించింది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది తంగలాన్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: