సూర్య‌కి జోడీగా ర‌ష్మిక‌, మాళ‌వికా మోహ‌న‌న్?

Rashmika Mandanna And Malavika Mohanan To Pair Up With Actor Suriya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Rashmika Mandanna,Malavika Mohanan,Suriya,Actor Suriya,Hero Suriya,#Suriya

ఈ వేస‌వికి `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` అంటూ సంద‌డి చేయ‌నున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య‌. అది విడుద‌ల‌య్యేలోపే త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ హ‌రి కాంబినేష‌న్ లో నెక్స్ట్ వెంచ‌ర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడు సూర్య‌. కాగా,`అరువా` (`క‌త్తి` అని అర్థం) పేరుతో రూపొంద‌నున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో సూర్య క‌వ‌ల సోద‌రులుగా న‌టించ‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న్న ఎంపిక కాగా, మ‌రో నాయిక‌గా మాళవికా మోహ‌న‌న్ సెలెక్ట్ అయింద‌ని కోలీవుడ్ టాక్. త్వ‌ర‌లోనే ర‌ష్మిక‌, మాళ‌విక ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. కాగా, ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ దీపావ‌ళి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. తెలుగులోనూ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అదే స‌మ‌యంలో అనువాద రూపంలో రిలీజ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − seven =