కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 4

Kollywood Star Heroes Karthi and Jayam Ravi Visits Sabarimala Ayyappa Swamy Temple
సినిమా వార్తలు

అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శించుకున్న స్టార్ హీరోలు

త‌మిళ స్టార్ హీరోలు కార్తి మరియు జ‌యం ర‌వి శబ‌రిమ‌ల‌ సందర్శించారు.ఈ మేరకు గురువారం రాత్రి అయ్య‌ప్ప మాల ధరించిన కార్తి, జ‌యం ర‌వి ఇరుముడితో శ‌బ‌రిమ‌ల‌కి వెళ్లి అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శించుకున్నారు. సాధారణ భక్తుల మాదిరే క్యూ లైన్‌లో వచ్చిన ఈ హీరోలు స్వామివారి ద‌ర్శనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Samantha Ruth Prabhu Announced Subham Release Date
రిలీజ్ అప్‌డేట్

శుభం రిలీజ్ డేట్ ప్రకటించిన సమంత

ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం.

Srikanth Mవాట్సాప్
Veera Dheera Sooran 2 OTT Release Date Fix
ఓటీటీ

వీర ధీర శూరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించే జాతీయ ఉత్త‌మ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌ క‌థానాయ‌కుడిగా నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ 2’. ఎస్‌.జె.సూర్య‌, దుషారా విజ‌య‌న్, సూరజ్ వెంజరమూడు కీల‌క పాత్ర‌లు పోషించారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు. అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Srikanth Mవాట్సాప్
Naveen Chandra's Blind Spot Trailer Released
ట్రైలర్ & టీజర్

బ్లైండ్ స్పాట్ ట్రైలర్ రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక. పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Jayasudha Appointed as Jury Chairperson For Gaddar Telangana Film Awards
సినిమా వార్తలు

గద్దర్‌ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా నటి జయసుధ

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది. ఈ జ్యూరీలో మొత్తం 15 మందితో కూడిన నిష్ణాతులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ సీనియర్ నటి జయసుధను ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఖరారుచేసింది.

Srikanth Mవాట్సాప్
L2: Empuraan OTT Platform and Streaming Date Announced
ఓటీటీ

L2: ఎంపురాన్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఏ ఓటీటీలో అంటే..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్‌’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇక విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

Srikanth Mవాట్సాప్
Director Sampath Nandi Thanks Audience For Odela 2 Success
సినిమా వార్తలు

ఓదెల 2 తాండవం మొదలైంది, సునామీగా మారబోతోంది

తమన్నా భాటియా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న విడుదలైన ఓదెల 2 అన్నిచోట్లా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Mythri Movie Makers Announces Sequel For JAAT
సినిమా వార్తలు

జాట్ 2 రానుంది

బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జాట్'. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై తొలినుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
a major action sequence shoot in second schedule for ntr neel
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ నీల్ షూట్ అప్డేట్

మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఈ షెడ్యూల్ జరిగింది.ఇక సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.ఈనెల 22న ఎన్టీఆర్ సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు.ఈషెడ్యూల్ దాదాపు 3వారాల పాటు బ్రేక్ లేకుండా జరుగనుందట.ఇందులో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.సినిమాలో ఈసీక్వెన్స్ హైలైట్ అవ్వనుందట.ప్రస్తుతం సినిమాకోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో వున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Sirrakaindhi Single Bathuku Lyrical Video Released From Single Movie
సినిమా వార్తలు

శ్రీ విష్ణు సింగిల్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'.షూటింగ్ పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
NC 24 shoot begins today
షూటింగ్ అప్‌డేట్

NC 24 షూటింగ్ స్టార్ట్

తండేల్ తో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య. రెండు నెలల క్రితం విడుదలైన ఈసినిమా నాగ చైతన్య కు అవసరమైన విజయాన్ని అందించింది.ఈసినిమా రిజల్ట్ ను కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన చైతన్య ఇక తన నెక్స్ట్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యాడు.

Mahender Reddyవాట్సాప్
TFDC Chairman Dil Raju Key Advice For Gaddar Film Awards Jury Members
సినిమా వార్తలు

గద్దర్‌ అవార్డ్స్ జ్యూరీకి దిల్ రాజు కీలక సూచన

తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ - TFDC) చైర్మన్ దిల్ రాజు 'గద్దర్‌ అవార్డ్స్' జ్యూరీకి కీలక సూచన చేశారు. బుధవారం సంస్థ సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్, ప్రముఖ నటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న దిల్ రాజు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కొరకు వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను కోరారు.

Srikanth Mవాట్సాప్
Retro completes censor formalities
సినిమా వార్తలు

రెట్రో రన్ టైం ఎంతంటే

కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.సూర్య ఈసినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు. ఇందులో తను గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.రేపు ఈసినిమా ఆడియో తోపాటు ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇందుకోసం చెన్నై లో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తయింది.యు/ఏ సర్టిఫికెట్ తో దాదాపు 2 గంటల 48 నిమిషాల భారీ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Hit 3 Kerala releases by Wayfarer Films
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ చేతికి హిట్ 3

నేచురల్ స్టార్ నాని నుండి నెస్ట్ వస్తున్న సినిమా హిట్ 3.ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.నాని సినిమాల్లోనే ఇప్పటివరకు మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తుంది హిట్ 3.ఇక ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.అందులో భాగంగా మలయాళ వెర్షన్ రైట్స్ ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫరర్ ఫిలిమ్స్ దక్కించుకుంది.దాంతో కేరళలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దుల్కర్ కు హిట్ 3 ట్రైలర్ బాగా నచ్చడంతో సినిమా రైట్స్ తీసుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Yamadonga Re Releasing Worldwide on May 18-20 During NTR's Birthday
సినిమా వార్తలు

గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతోన్న యమదొంగ

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. స్టార్ హీరోల బ‌ర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెల‌బ్రేష‌న్స్‌ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదేవిధంగా ఈ ట్రెండ్ నిర్మాతలకి కూడా కాసులవర్షం కురిపిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Sarangapani Jathakam Trailer Released
ట్రైలర్ & టీజర్

హిలేరియస్‌గా సారంగపాణి జాతకం ట్రైలర్‌

క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 25న సారంగపాణి జాతకం సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Srikanth Mవాట్సాప్
45 movie telugu teaser out now
ట్రైలర్ & టీజర్

45 తెలుగు టీజర్ రిలీజ్

కన్నడ స్టార్స్ శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 45.ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా 45 ని డైరెక్ట్ చేస్తుండగా సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా తెలుగు టీజర్ లాంఛ్ నిర్వహించారు.ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
jaat 6 days collections
బాక్సాఫీస్

జాట్ 6 డేస్ కలెక్షన్స్

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ జాట్ వీక్ డేస్ లో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న దేశ వ్యాప్తంగా 6కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో 6రోజుల్లో ఈసినిమా దేశవ్యాప్తంగా 65.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈ వారం లో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. ప్రస్తుతం మరో సినిమాతో పోటీ లేకపోవడం జాట్ కు అడ్వాంటేజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
This week two notable Telugu films are set to release in theaters
సినిమా వార్తలు

ఈవారం రెండు సినిమాలు రానున్నాయి

గత వారం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు.డబ్బింగ్ సినిమా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే పెద్ద సినిమాగా వచ్చింది. అయితే ఈ వారం రెండు హైప్ వున్న తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.అందులో ఓదెల 2 ఒకటి కాగా మరొకటి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ రెండు సినిమాలకు మంచి బజ్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Kichcha Sudeep’s Sci-Fi Spectacle Billa Ranga Baasha Shoot Begins
షూటింగ్ అప్‌డేట్

కిచ్చా సుదీప్ 'బిల్లా రంగా బాషా' షూటింగ్ ప్రారంభం

భారతీయ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కొత్త శకానికి నాంది పలుకుతూ 'బిల్లా రంగ బాషా' ఈరోజు షూటింగ్ ప్రారంభమైయింది. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 AD ఫ్యుచర్‌లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

Srikanth Mవాట్సాప్

షేర్