ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’.షూటింగ్ పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గీతా ఆర్ట్స్, కల్యా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే నెలలో థియేటర్లోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు. ఇప్పటికే ‘శిల్పి యెవరో’ అనే ఫస్ట్ సింగిల్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా సెకండ్ సింగిల్ గ్రూవ్ టు ది ఫ్రస్ట్రేషన్ యాంథమ్ ‘సిర్రాకైంది’ రిలీజ్ చేసింది.
పాటలో సరదా సాహిత్యం, ఆకట్టుకునే మాస్ అప్పీల్ ఉన్నాయి. రాహుల్ సిప్లిగంజ్ వోకల్స్, రామజోగయ్య శాస్త్రి చమత్కారమైన సాహిత్యంతో ఈ సాంగ్ అలరిస్తోంది. అలాగే శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్‌తో కలిసి ఒంటరితాన్ని హ్యుమర్‌తో జోడిస్తూ చెప్పడం హిలేరియస్‌గా వుంది. బ్యాచిలర్స్ బాధలను ఫన్నీగా తెలిపేలావున్న ఈ సాంగ్ యువతకు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతోంది. మోడరన్ వైబ్, థీమ్ యూత్‌ని మెస్మరైజ్ చేశాలా వున్నాయి. మొత్తానికి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: