వీర ధీర శూరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Veera Dheera Sooran 2 OTT Release Date Fix

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించే జాతీయ ఉత్త‌మ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌ క‌థానాయ‌కుడిగా నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ 2’. ఎస్‌.జె.సూర్య‌, దుషారా విజ‌య‌న్, సూరజ్ వెంజరమూడు కీల‌క పాత్ర‌లు పోషించారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు. అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, ప్రసన్న జికె ఎడిటింగ్‌ అందించారు. అయితే ఈ సినిమా పార్ట్ 1 కంటే ముందే పార్ట్ 2ని విడుదల చేయడం గమనార్హం. వీర ధీర శూరన్ 2 సినిమాకి ప్రీక్వెల్‌గా పార్ట్ 1 తెరకెక్కించనున్నట్టు డైరెక్టర్ తెలిపారు. విక్రమ్ నటించిన ఈ 62వ చిత్రం, మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఒక్కరాత్రిలో జరిగే కథగా రూపొందిన వీర ధీర శూరన్ 2 ప్రేక్షకులను బాగానే అలరించింది. సూపర్ హిట్ ‘తంగలాన్’ తర్వాత విక్రమ్ చేసిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. దీంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించి కీలక అప్‌డేట్ అందించింది చిత్ర యూనిట్.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 24న వీర ధీర శూరన్ 2 విడుదలకానుంది. ఈ మేరకు అమెజాన్ సోషల్ మీడియాలో దీనిగురించి “ఒక రాత్రి. నో రూల్స్. మనుగడ మాత్రమే. ప్రతిదీ మార్చే రాత్రి.” అని పేర్కొంది. కాగా వీర ధీర శూరన్ 2 తమిళం సహా తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది. సో.. మూవీ లవర్స్ థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని పొందండి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.