తండేల్ తో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య. రెండు నెలల క్రితం విడుదలైన ఈసినిమా నాగ చైతన్య కు అవసరమైన విజయాన్ని అందించింది.ఈసినిమా రిజల్ట్ ను కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన చైతన్య ఇక తన నెక్స్ట్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు తో నాగ చైతన్య తన 24వ సినిమా చేస్తున్నాడని తెలిసిందే.ఈసినిమా షూటింగ్ ఈరోజే స్టార్ట్ అయ్యింది.అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ జరుగుతుంది.దాదాపు రెండు వారాల పాటు ఈషెడ్యూల్ జరుగనుంది.ఈసినిమాలో నాగ చైతన్య సరికొత్త లుక్ లో కనిపించాడు.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.ఎస్విసిసి ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఈఏడాది లో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.మైథికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుండడం తో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండనుంది.చైతన్య ఈ జోనర్ లో నటించడం ఇదే మొదటిసారి.అంతేకాదు తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాకూడా ఇదే.మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: