బ్లైండ్ స్పాట్ ట్రైలర్ రిలీజ్

Naveen Chandra's Blind Spot Trailer Released

ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక. పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే శ్రీరామ నవమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన బ్లైండ్ స్పాట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. తాజాగా షూటింగ్ ముగించుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్‌ అయితే సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది.

బ్లైండ్ స్పాట్ ట్రైలర్ ఎలా ఉందంటే..?

ట్రైలర్ ఓపెనింగ్ సీన్ లోనే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధమవుతుంది. హీరో నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కనిపించాడు. సీలింగ్ ఫ్యాన్‌కి హ్యాంగ్ అవుతున్న లేడీ బాడీ చూడగానే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని పసిగడతాడు. అక్కడినుంచీ దీనిలో ప్రమేయం ఉండొచ్చు అనుకున్న ప్రతిఒక్కరినీ ప్రశ్నల పరంపరతో విచారణ మొదలుపెడతాడు. చివరికి ఇది ఎవరు చేశారో తెలుసుకుంటాడు. అయితే ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ మొత్తం ఎంతో ఆసక్తికరంగావుంది.

కాగా బ్లైండ్ స్పాట్ సినిమాకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తుండగా.. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.