బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ జాట్ వీక్ డేస్ లో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న దేశ వ్యాప్తంగా 6కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో 6రోజుల్లో ఈసినిమా దేశవ్యాప్తంగా 65.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈ వారం లో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. ప్రస్తుతం మరో సినిమాతో పోటీ లేకపోవడం జాట్ కు అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే గదర్ 2 తోపోలిస్తే జాట్ వెనకబడింది.మరి ఫుల్ రన్ లో జాట్ ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి.జాట్ బ్రేక్ ఈవెన్ కావాలంటే 100 కోట్లకుపైనే రాబట్టాల్సివుంది.
టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈసినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు.జాట్ ను హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి హిందీ జనాలను ఆకట్టుకున్నాడు.ఇందులో రణదీప్ హూడా విలన్ పాత్రలో కనిపించగా రెజీనా కసాండ్రా ,సయామి ఖేర్, రమ్యకృష్ణ ,జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించాయి.తమన్ సంగీతం అందించాడు.అయితే తెలుగు డైరెక్టర్ ,తెలుగు నిర్మాతల కాంబినేషన్ లో వచ్చిన జాట్ తెలుగులో రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ లేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























